RCB vs PBKS: ఓడినా ఇంకా ఐపీఎల్ 2025 ఫైనల్ రేసులో పంజాబ్ !

Published : May 30, 2025, 12:01 AM IST

Punjab Kings IPL 2025 : క్వాలిఫైయర్-1లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోయినా, ఐపీఎల్ 2025 నుండి ఇంకా అవుట్ కాలేదు. ఆ పంజాబ్ కింగ్స్ కు ఇంకా టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 లో ఆర్సీబీ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఆటతో లీగ్ దశలో నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది పంజాబ్ కింగ్స్. కానీ, క్వాలిఫైయర్-1లో ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి, ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంది. దీంతో 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంది. 

25
ఆర్సీబీ చేతిలో ఓడినా ఐపీఎల్ 2025 ఫైనల్ రేసులో పంజాబ్ కింగ్స్

ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్-1లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది. అయితే, ఇంకా పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ నుండి అవుట్ కాలేదు. ఇంకా ఫైనల్ రేసులో ఉంది. పంజాబ్ కింగ్స్ మళ్ళీ  ఆర్సీబీతో ఫైనల్ లో తలపడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 ఫైనల్ పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ మధ్య జరగవచ్చు.

35
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్ చెత్త బ్యాటింగ్

ఐపీఎల్ 2025 క్వాలిఫైయర్-1లో అన్ని వికెట్లు కోల్పోయి కేవలం 101 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్. ఈ స్వల్ప టార్గెట్ ను 10 ఓవర్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ ఛేదించింది. సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్ చెరో 3 వికెట్లు తీసి పంజాబ్‌ను కట్టడి చేశారు. సాల్ట్ 27 బంతుల్లో 56 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఆర్సీబీకి విజయాన్ని అందించారు.

45
పంజాబ్ కింగ్స్ కు రెండో క్వాలిఫైయర్‌ తో ఫైనల్ ఛాన్సులు

పంజాబ్ కింగ్స్ మొదటి క్వాలిఫైయర్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయినా, ఐపీఎల్ 2025 ఫైనల్ ఆడే అవకాశాలు మిగిలే ఉన్నాయి. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన ప్రయోజనం పొందుతుంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో తలపడుతుంది.

55
రెండో క్వాలిఫైయర్‌లో గెలిస్తే ఫైనల్ కు పంజాబ్

పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 రెండో క్వాలిఫైయర్‌లో గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. అప్పుడు ఫైనల్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. కానీ ఫైనల్ చేరాలంటే, పంజాబ్ క్వాలిఫైయర్-2ని తప్పక గెలవాలి. ఓడితే ఇంటికి చేరుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories