IPL Qualifier 1: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1.. PBKS vs RCB లో ఫైనల్ టికెట్ ఎవరిది?

Published : May 29, 2025, 05:17 PM IST

Punjab kings vs Royal challengers Bengaluru: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్, బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. అయితే, ఫైనల్‌ టికెట్ ఎవరు  దక్కించుకుంటారు?

PREV
16
ఐపీఎల్ 2025 ఫైనల్ బెర్త్ కోసం పోటీ పడుతున్న పంజాబ్ vs బెంగళూరు

Punjab kings vs Royal challengers Bengaluru: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ పంజాబ్ కింగ్స్ (PBKS) - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరుగుతుంది. ఈ హైవోల్టేజ్ పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. చెరో మ్యాచ్ ను గెలుచుకున్నాయి. ఈ సీజన్ లో మూడో సారి తలపడుతున్నాయి. 

26
RCB vs PBKS: ఐపీఎల్ లో మొత్తంగా పంజాబ్ దే పైచేయి

ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఈ జట్ల మధ్య 35 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 18 మ్యాచ్‌ల్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఆర్సీబీ 17 మ్యాచ్‌లలో గెలిచింది. అయితే, 2023 నుంచి ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌లలో నాలుగింటిలో ఆర్సీబీ విజయం సాధించడం విశేషం.

36
ఆర్సీబీ ఓపెనింగ్ జోడీకి అర్షదీప్ సింగ్ ఛాలెంజ్

ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కలిసి ఈ సీజన్‌లో 11 ఇన్నింగ్స్‌లలో 517 పరుగులు సాధించారు. ఆ జోడీ 176 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసింది. అయితే, పంజాబ్ కింగ్స్ తరఫున 18 వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్ ఈ విధ్వంసకర జోడీని దెబ్బకొట్టాలని చూస్తున్నాడు. సాల్ట్‌ను టీ20ల్లో అర్షదీప్ సింగ్ ఎనిమిది ఇన్నింగ్స్‌లలో నాలుగుసార్లు అవుట్ చేశాడు. అతని బౌలింగ్ లో కేవలం 78 స్ట్రైక్‌రేట్‌తో 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కోహ్లీపై అర్షదీప్ ప్రభావం తక్కువే అయినా, రెండుసార్లు అతన్ని అవుట్ చేయడం గమనార్హం.

46
కోహ్లీపై హర్ప్రీత్ బ్రార్ ప్రభావం

హర్ప్రీత్ బ్రార్ కూడా కోహ్లీని రెండు సార్లు అవుట్ చేశాడు. బ్రార్ బౌలింగ్ లో కోహ్లీ కేవలం 110 స్ట్రైక్‌రేట్‌తో 74 పరుగులు మాత్రమే చేశాడు.

ప్రభ్ సిమ్రన్, శ్రేయస్‌లకు భువనేశ్వర్ చెక్ పెడతాడా?

ఈ సీజన్‌లోఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న మూడవ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు. అతను పంజాబ్ కింగ్స్ లోని స్టార్ బ్యాటర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్‌లకు తలనొప్పి తెప్పించగలడు. ఎందుకంటే ప్రభ్ సిమ్రన్‌ను భువీ మూడు సార్లు అవుట్ చేశాడు. అలాగే, తన బౌలింగ్ లో కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చాడు. శ్రేయస్‌ ను 11 ఇన్నింగ్స్ లలో మూడు సార్లు భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు.

56
బ్యాటింగ్, బౌలింగ్ లో బలంగా ఉన్న ఆర్సీబీ

ఆర్సీబీ గత సీజన్లతో పోలిస్తే ఈ సారి చాలా బలంగా మారింది. విరాట్ కోహ్లీ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలాగే, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్, లివింగ్ స్టోన్, షేఫర్డ్ లతో బలమైన బ్యాటింగ్ విభాగాన్ని కలిగి ఉంది. అలాగే, ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ఈ మ్యాచ్ ఆడితే, శ్రేయస్‌పై మరింత ఒత్తిడి రానుంది. అతను ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడుసార్లు అయ్యర్ ను అవుట్ చేశాడు.

66
చాహల్ తిరిగొస్తే పంజాబ్ బౌలింగ్ మరింత బలంగా మారుతుంది

గాయంతో కొంతకాలంగా బయట ఉన్న యుజ్వేంద్ర చహల్ ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ, రజత్ పటిదార్ వంటి ఆటగాళ్లపై చాహల్ కు మంచి బౌలింగ్ రికార్డు ఉంది. కాబట్టి ఆర్సీబీకి చాహల్ తో కష్టమే. మయాంక్‌ను తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఆరు సార్లు అవుట్ చేయగా, జితేష్‌ను ఏడు ఇన్నింగ్స్ లలో మూడుసార్లు ఔట్ చేశాడు. పటిదార్‌ను నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు అవుట్ చేయడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories