Rohit Sharma-Yashasvi Jaiswal
ICC Rankings - Yashasvi Jaiswal: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటికే 4 మ్యాచ్ లు పూర్తికాగా, 5వ టెస్టు మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. అయితే, ఇప్పటివరకు ఈ సిరీస్ లో భారత యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ 600కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతను వరుసగా 80, 15, 209, 17, 10, 214, 73, 37 చొప్పున మొత్తం 655 పరుగులు చేశాడు. చివరి 4వ టెస్టు మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.
Yashasvi Jaiswal
ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ లో మార్చి 7 నుంచి ధర్మశాలలో జరగనుంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్ లో యశస్వి జైస్వాల్ సత్తా చాటాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్‌ల ర్యాంకింగ్స్ లో జైస్వాల్ 3 స్థానాలు మెరుగుపడి 12వ ర్యాంక్‌లో నిలిచాడు. రోహిత్ శర్మ 12వ స్థానం నుంచి 13వ స్థానానికి పడిపోయాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మను జైస్వాల్ అధిగమించాడు.
yashasvi jaiswal.jp
టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ 744 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. జైస్వాల్ 727 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో ఉన్నాడు. చివరి మ్యాచ్ లో జైస్వాల్ సెంచరీ సాధిస్తే విరాట్ కోహ్లీని అధిగమించే అవకాశముంది. రోహిత్ శర్మ కూడా 720 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ నెం.1 స్థానంలో ఉన్నాడు.
yashasvi jaiswal 7
టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ జస్ప్రీత్ బుమ్రా నంబర్‌వన్‌గా ఉన్నాడు. అతను 867 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రవిచంద్రన్ అశ్విన్ 846 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా 785 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.
yashasvi jaiswal 8.jp
టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో టాప్ 5లో భారత ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో రవీంద్ర జడేజా 449 పాయింట్లతో నంబర్ 1, రవిచంద్రన్ అశ్విన్ 323 పాయింట్లతో 2వ స్థానంలో ఉన్నారు. అక్షర్ పటేల్ కూడా 275 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్నాడు.