టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !

First Published | Feb 28, 2024, 10:22 PM IST

Team India: టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాట్స్ మన్ గా వినోద్ కాంబ్లీ రికార్డు సృష్టించాడు. 23 ఇన్నింగ్స్ ల‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు భార‌త మాజీ ప్లేయ‌ర్ సంజయ్ మంజ్రేకర్. భార‌త క్రికెట్ చరిత్ర‌లో అత్యంత వేగంగా టెస్టు క్రికెట్ లో 1000 ప‌రుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్ల లిస్టును గ‌మ‌నిస్తే.. 
 

Mayank Agarwal, Sunil Gavaskar, Vinod Kambli, Cheteshwar Pujara

5. సంజయ్ మంజ్రేకర్

భారత మాజీ బ్యాట్స్ మ‌న్ సంజయ్ మంజ్రేకర్‌కు సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ లో కొన‌సాగ‌లేదు కానీ, అత‌ని ప్రారంభం అదిరిపోయింది. వెస్టిండీస్‌తో అరంగేట్రం టెస్టులో కేవలం 5, 10 పరుగులు మాత్రమే చేశాడు, కానీ తర్వాత వేగం పెంచాడు. మంజ్రేకర్ తన 23వ ఇన్నింగ్స్‌లో టెస్ట్ క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. మొత్తంమీద, అతను 37 టెస్టులు ఆడాడు. 37.14 సగటుతో 2043 పరుగులు చేయ‌గా, ఇందులో నాలుగు సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

4. సునీల్ గవాస్కర్

భార‌త దిగ్గజ క్రికెట‌ర్ సునీల్ గవాస్కర్ వెస్టిండీస్ తో జ‌రిగిన మ్యాచ్ లో 1971లో తన అరంగేట్రం చేసాడు. ఆ మ్యాచ్ లో 65, 67 పరుగులు చేశాడు. అదే ఆట‌తీరును కొన‌సాగిస్తూ.. 21 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులను పూర్తి చేశాడు. టెస్టు క్రికెట్ లో 10,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. త‌న కెరీర్ లో 34 సెంచరీలు, 45 అర్ధసెంచరీలతో సహా 51.12 సగటుతో 10122 పరుగులతో రిటైరయ్యాడు.


Mayank Agarwal

3. మయాంక్ అగర్వాల్

ఆస్ట్రేలియన్ పేస్ దాడికి వ్యతిరేకంగా ఐకానిక్ ఎంసీజీలో అరంగేట్రం చేసిన మ్యాచ్ లో 76, 42 పరుగులు చేశాడు. మయాంక్ అగర్వాల్ తొలి పది టెస్టుల్లో రెండు డబుల్ సెంచరీలు బాదాడు. టెస్టు క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసేందుకు అగర్వాల్ కేవలం 19 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. 2018-2021లో ఆస్ట్రేలియాలో భారత్ సాధించిన టెస్ట్ సిరీస్ విజయాలలో కీల‌క‌పాత్ర పోషించాడు.

എന്നിട്ടും ഇന്ത്യൻ ടീമിലില്ല

2. ఛ‌తేశ్వర్ పుజారా

ది వాల్ రాహుల్ ద్రవిడ్ రిటైర్మెంట్ తర్వాత, ఒత్తిడిని తట్టుకుని భారీ పరుగులు చేయగల నం. 3లో బలమైన వ్యక్తి అవసరమైంది. అలాంటి స‌మ‌యంలో ఛ‌తేశ్వర్ పుజారా టీమిండియా లోకి ఎంట్రీ ఇచ్చాడు. భారత్ త‌ర‌ఫును అద్భుత‌మైన ఇన్నింగ్స్ లు ఆడాడు. టెస్టు క్రికెట్‌లో 1000 పరుగులు పూర్తి చేసేందుకు పుజారా కేవలం 18 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. ఇప్పటివరకు 103 టెస్టుల్లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలతో 7195 పరుగులు చేశాడు.

1. వినోద్ కాంబ్లీ

వినోద్ కాంబ్లీ భారత క్రికెట్‌లోని బ్యాడ్ బాయ్‌లలో ఒకరిగా మిగిలిన ఈ ప్లేయ‌ర్ అద్భుత‌మైన ఆరంభ కెరీర్ ను కొన‌సాగించాడు. సచిన్ టెండూల్కర్ బ్యాచ్‌లో ఉన్న ఈ ప్లేయ‌ర్ కేవలం 14 ఇన్నింగ్స్‌లలో 1000 టెస్ట్ పరుగులను పూర్తి చేసిన వేగవంతమైన భారతీయ క్రికెట‌ర్ గా నిలిచాడు. అలాగే, అంత‌ర్జాతీయ క్రికెట్ లో మూడో ప్లేయ‌ర్ గా ఉన్నాడు. కాంబ్లీ 17 టెస్టులు ఆడి 21 ఇన్నింగ్స్‌ల్లో 54.20 సగటుతో నాలుగు సెంచరీలతో 1084 పరుగులు చేశాడు.

Latest Videos

click me!