టెస్టు క్రికెట్ లో గొప్ప రికార్డు.. సచిన్-ద్రవిడ్-పాంటింగ్ కాదు.. ఎవరా ప్లేయర్?

Published : Apr 04, 2025, 05:26 PM IST

Cricket Records: టెస్టు క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే, ఈ దిగ్గ‌జాల‌ను వెన‌క్కినెడుతూ మ‌రో రికార్డు బ‌ద్ద‌లు కొట్ట‌డానికి సిద్ధంగా ఉన్నాడు ఒక ప్లేయ‌ర్. ఆ రికార్డు ఏంటీ? ఆ ప్లేయ‌ర్ ఎవ‌రు అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
14
టెస్టు క్రికెట్ లో గొప్ప రికార్డు.. సచిన్-ద్రవిడ్-పాంటింగ్ కాదు.. ఎవరా ప్లేయర్?

Cricket Records: సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్..  ఈ లెజెండరీ ప్లేయర్లు క్రికెట్ లో అద్భుతమైన ఆటతో అనేక రికార్డులు సాధించారు. వీరు సాధించిన రికార్డులను పవర్ హిట్టర్లు కూడా కూడా బద్దలు కొట్టలేకపోయారు, కానీ 34 ఏళ్ల బ్యాట్స్‌మన్ ఈ దిగ్గజాలతో సహా ప్రపంచ క్రికెటర్లకు సాధ్యంకాని రికార్డును సాధించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో మరో 28 పరుగులు చేస్తే ఈ ఫార్మట్ లో ఎవరికీ సాధ్యంకాని రికార్డును అందుకోనున్నాడు. అతనే ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్. 

24
Joe Root (Photo- ICC Cricket)

జూన్ 30 నుంచి భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌

ఈ ఏడాది జూన్ 30 నుండి ఇంగ్లాండ్ స్వదేశంలో భారత్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆడ‌నుంది. భారత్ చివరిసారిగా 2021-22లో ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు, రెండు జట్లు నువ్వానేనా అనే విధంగా గెలుపుకోసం పోరాడాయి. అయితే,  2-2తో సిరీస్ డ్రాగా ముగిసింది.

ఇంగ్లాండ్-భారత్ రెండూ వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ 2025 ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. దీంతో వ‌చ్చే సీజ‌న్ ను విజ‌యంతో ప్రారంభించాల‌ని చూస్తున్నాయి. దీని కోసం గెలుపు వ్యూహాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ సిరీస్ ఇంగ్లాండ్ స్టార్ బ్యాట‌ర్ జోరూట్ మ‌రో ప్ర‌పంచ రికార్డు సాధించ‌నున్నాడు. 

34

క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకేఒక్క‌డు జోరూట్ !

5 మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్ట్ సిరీస్‌లో అందరి దృష్టి ఉండే ఆటగాళ్లలో జో రూట్ కూడా ఉన్నాడు. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ గొప్ప బ్యాట్స్‌మన్ కొంతకాలంగా టెస్టు క్రికెట్ లో అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతూ రికార్డుల మోత మోగిస్తున్నాడు. హెడింగ్లీలో జరిగే తొలి టెస్టులో జో రూట్ మ‌రో బిగ్ కార్డును సాధిస్తాడు. 152 మ్యాచ్‌ల్లో 12972 పరుగులు చేసిన రూట్, మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా 13000 టెస్ట్ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు ఇంకా 28 పరుగులు అవసరం.

44

టెస్టు క్రికెట్ లో త‌క్కువ మ్యాచ్ లు ఆడి 13000 ప‌రుగులు రికార్డు సాధించిన ప్లేయ‌ర్ల‌లో క‌ల్లిస్ టాప్ లో ఉన్నాడు. 159 మ్యాచ్‌ల్లో జాక్వెస్ కల్లిస్ ఈ రికార్డు సాధించాడు. రాహుల్ ద్రవిడ్ 160, రికీ పాంటింగ్ 162, సచిన్ టెండూల్కర్ 163 మ్యాచ్‌ల్లో 13000 పరుగులు సాధించారు. మే నెలలో జింబాబ్వేతో జరిగే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లో కూడా రూట్ ఈ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. కానీ, ఈ సిరీస్ లో యంగ్ ప్లేయ‌ర్ల‌ను ఆడించాల‌ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ చూస్తోంది. 

కాబ‌ట్టి భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రూట్ ఆ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డం ప‌క్కా. అలాగే, మ‌రో 457 పరుగులు చేస్తే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 6000 పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మన్‌గా కూడా రికార్డు సాధిస్తాడు. WTCలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ 64 మ్యాచ్‌ల్లో 5543 పరుగులతో టాప్ లో ఉన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories