IPL 2025 KKR vs SRH: హ్యాట్రిక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమికి కారణాలు ఇవే

IPL 2025 KKR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తో జరిగిన ఐపీఎల్ 15వ  మ్యాచ్ లో ఏకంగా 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

IPL 2025 KKR vs SRH: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 15వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 80 పరుగుల తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. ఇది హైద‌రాబాద్ టీమ్ కు వ‌రుస‌గా మూడో ఓట‌మి. అయితే, ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ లో హైద‌రాబాద్ టీమ్ ఎందుకు ఓడిపోయింది? ఎస్ఆర్హెచ్ ఓట‌మికి గ‌ల కార‌ణ‌లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1. త్వరగా కీలక వికెట్లు కోల్పోవడం

201 పరుగుల భారీ టార్గెట్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ కు మంచి ఆరంభం లభించలేదు. SRH కీలక టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను ప్రారంభంలోనే కోల్పోయింది. దీంతో ఛేజింగ్ లో ఘోరంగా విఫలమైంది. హైదబాద్ సునామీ ఇన్నింగ్స్ లు ఆడే ప్లేయర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు త్వరగానే అవుట్ అయ్యారు. దీందో మిడిలార్డర్ పై ఓత్తిడిపడింది. ఆ తర్వాత టీమ్ కోలుకోలేకపోయింది. 

2. కేకేఆర్ సూపర్ బౌలింగ్  

ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది కోల్ కతా నైట్ రైడర్స్. బౌలర్లు ముఖ్యంగా వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిలు హైదరాబాద్ టీమ్ ను కోలుకోని దెబ్బకొట్టారు. అరోరా ఆరంభంలో అదరగొడితే వరుణ్ చక్రవర్తి తర్వాత దానిని పూర్తి చేశాడు. కేకేఆర్ టీమ్ లోని బౌలర్లు అందరూ వికెట్లు తీయడం కేకేఆర్ ను గెలుపును మరింత వేగంగా మార్చింది. 


Heinrich Klaasen. (Photo- SRH)

3. కేకేఆర్ సునామీ బ్యాటింగ్.. వెంకటేష్ అయ్యర్ బ్లాస్టింగ్ ఇన్నింగ్స్  

ఈ మ్యాచ్ లో కేకేఆర్ 201 పరుగుల టార్గెట్ ను హైదరాబాద్ టీమ్ ముందు ఉంచింది. ఆరంభంలో హైదరాబాద్ బౌలింగ్ పనిచేసినా.. ఆ తర్వాత కేకేఆర్ బ్యాటర్ల ముందు నిలవలేకపోయింది. కోల్ కతా బ్యాటర్లు అద్భుతమైన బ్యాటింగ్ లో జట్టు స్కోర్ ను డబుల్ సెంచరీ దాటించారు. అజింక్య రహానే, రింకూ సింగ్ లతో పాటు అంగ్‌క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్ ల సునామీ బ్యాటింగ్ తో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వెంకటేష్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. యంగ్ ప్లేయర్ రఘువంశీ 50 పరుగులు, రహానే 38, రింకూ సింగ్ 32 పరుగులు ఇన్నింగ్స్ లను ఆడారు. 
 

4. కుప్పకూలిన హైదరాబాద్ భయంకర బ్యాటింగ్ లైనప్ 

ఐపీఎల్ లో హైదరాబాద్ టీమ్ బలమైన బ్యాటింగ్ లైనప్ ను కలిగి ఉంది. అయితే, ఛేజింగ్ సమయంలో SRH బ్యాటింగ్ లైనప్ ఘోరంగా విఫలమవుతోంది. ఈ మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్ 33 పరుగులు ఇన్నింగ్స్ మినహా ఎవరూ చెపుకోదగ్గ ఇన్నింగ్స్ లను ఆడలేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, ప్యాట్ కమ్మిన్స్ ఎవరు పెద్దగా పరుగులు చేయలేకపోయారు. 

Nitish Kumar Reddy IPL

5. డెత్ ఓవర్లలో సూపర్ హిట్టింగ్.. హైదరాబాద్ బౌలింగ్ పనిచేయలేదు !

ఈ మ్యాచ్ లో ఆరంభంలో హైదరాబాద్ బౌలింగ్ ప్రభావం కనిపించినా.. మ్యాచ్ పూర్తయ్యే సరికి పెద్దగా ఫలించలేదని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ టీమ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరీ ముఖ్యంగా వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ లు డెత్ ఓవర్లలో భారీగా పరుగులు చేశారు. అలాగే, మ్యాచ్ పై ఏ సమయంలోనూ హైదరాబాద్ బలమైన నియంత్రణను సాధించలేకపోయింది. KKR బ్యాట్స్‌మెన్ డెత్ ఓవర్లలో దంచికొట్టారు. కానీ, ఆ విధంగా హైదరాబాద్ జట్టు చేయలేకపోయింది. 

దీంతో పాటు ఛేజింగ్ లో ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవం, రన్ రేటు పెరుగుతుండటం హైదరాబాద్ టీమ్ పై ఒత్తిడిని పెంచింది. SRH టీమ్ లో పెద్ద భాగస్వామ్యాలు లేకపోవడం కూడా మ్యాచ్ ను మార్చింది. మొత్తంగా కేకేఆర్ తో హైదరాబాడ్ టీమ్ ఓటమికి వెంకటేష్ అయ్యర్ సునామీ బ్యాటింగ్, డెత్ ఓవర్లలో ఎస్ఆర్హెచ్ చెత్త బౌలింగ్, ఛేజింగ్‌ సమయంలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిల సూపర్ బౌలింగ్ లు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

Latest Videos

click me!