టీ20 ప్రపంచ కప్ 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-5 బౌలర్లలలో ఫజల్హక్ ఫారూఖీ, అర్ష్ దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, అన్రిచ్ నోర్ట్జే, రషీద్ ఖాన్ లు ఉన్నారు.
అయితే, ఈ ప్రపంచ కప్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న వారిలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేడు.. ఆస్ట్రేలియా స్టార్ పాట్ కమ్మిన్స్ లేడు.. వీరిద్దరిని దాటేసిన టీమిండియా యంగ్ బౌలర్ అద్భుతంగా రాణించి డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసుకున్నాడు.
India , Cricket, Arshdeep Singh
ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. టోర్నీ ఆరంభం నుంచి చివరి వరకు తన బౌలింగ్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బార్బడోస్ లో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై కూడా అర్ష్‌దీప్ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. జట్టు గెలవడంలో అతని సపోర్టు కూడా కీలకంగా ఉంది.
టీప్రపంచ కప్ 2024 లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల జాబితాలో అర్ష్ దీప్ సింగ్ రెండో స్థానంలో ఉన్నారు. అతను 8 మ్యాచ్ లలో 17 వికెట్లు తీసుకున్నాడు. ఇందులో ఒక మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
ఇక డెత్ ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా కూడా అర్ష్ దీప్ సింగ్ ఘనత సాధించాడు. పాట్ కమ్మిన్స్, జస్ప్రీత్ బుమ్రాలను అధిగమించాడు. అర్ష్‌దీప్ 8.2 ఎకానమీతో డెత్ ఓవర్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లాండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్ కూడా తొమ్మిది వికెట్లు పడగొట్టాడు, అయితే అతని ఎకానమీ రేటు 8.9గా ఉండటంతో ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.
డెత్ ఓవర్లలో ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ నిలిచాడు. కమ్మిన్స్ తర్వాత భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఏడు వికెట్లు పడగొట్టాడు. అయితే, బుమ్రా ఎకానమీ 4.4గా ఉంది.