రోల్స్ రాయిస్ నుండి ఫెరారీ వరకు.. ధోని గ్యారేజీలోని కార్లు ఏవో తెలుసా?

First Published | Jul 2, 2024, 7:30 PM IST

MS Dhoni's car collection : మూడు క్రికెట్ ఫార్మాట్ల‌లో భార‌త జ‌ట్టును ఛాంపియ‌న్ గా నిలిపిన దిగ్గ‌జ ప్లేయ‌ర్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి కార్లు అంటే ఎంత ఇష్ట‌మ‌నే విష‌యాన్ని చాలా సార్లు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న క్రికెటర్ గా ఉన్న ధోని గ్యారేజీలో రోల్స్ రాయ‌స్ నుంచి ఫెరారీ వ‌ర‌కు అనేక ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. 

MS Dhoni’s car collection : ధోని తన 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సాక్షి ధోనికి వింటేజ్ స్టైల్ ల‌గ్జ‌రీ కారు ఫోక్స్‌వ్యాగన్ బీటిల్‌ను బహుమతిగా ఇచ్చాడు. ధోనీ కార్ల గ్యారేజీలో వింటేజ్, లగ్జరీతో పాటు భారీ బ‌డ్జెట్ కార్లు కూడా ఉన్నాయి. 2019 లోధోని ఒకప్పుడు భారత సైన్యంలో భాగమైన కారును కొనుగోలు చేయడం ద్వారా భారత సైన్యంపై తన ప్రేమను చాటుకున్నాడు. 

హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కారు

ఎంఎస్ ధోనికి హిందుస్థాన్ మోటార్స్ అంబాసిడర్ కారు ఉంది. దీనిని ఒకప్పుడు 'వీల్స్ ఆఫ్ ఇండియా' అని పిలిచేవారు. ఈ ఐకానిక్ కారు 55 సంవత్సరాల పాటు భారతదేశ రహదారులపై రారాజుగా కొన‌సాగింది. హిందూస్థాన్ మోటార్స్ 2014 తర్వాత అంబాసిడర్ కార్ల‌ ఉత్పత్తిని నిలిపివేసినందున గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్లు కనిపించడం లేదు. కానీ, ధోని గ్యారేజీలో ఇప్ప‌టికే అంబాసిడర్ కారు ఉంది. 


నిస్సాన్ జోంగా

ధోనీ 2019లో నిస్సాన్ జోంగాను కొనుగోలు చేశాడు. ఇది భారత సైన్యం కూడా ఉపయోగించే ప్ర‌త్యేక‌ కారు.

మహీంద్రా స్కార్పియో

2007లో మహీంద్రా గ్రూప్ ధోనీకి స్కార్పియోను బహుమతిగా ఇచ్చింది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఆయన ఇది అందుకున్నారు. 

మిత్సుబిషి పజెరో SFX ఒకప్పుడు చాలా ప్రసిద్ధి చెందిన కారు.. ఈ వింటేజ్ ప‌జెరోను కూడా ధోనీ కోనుగోలు చేశారు. ఈ కారు ఉత్ప‌త్తిని 2021లో నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే.

ధోనికి వింటేజ్ కార్లంటే చాలా ఇష్టం. ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2 & ల్యాండ్ రోవర్ 3 వంటి వింటేజ్ కార్లంటే చాలా ఇష్టం, అందుకే బిగ్ బాయ్ టాయ్జ్ వేలంలో ల్యాండ్ రోవర్ 3ని కొనుగోలు చేశాడు.

హమ్మర్

ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ కార్ల గ్యారేజీలో హ‌మ్మ‌ర్ కూడా ఉంది. ధోని తరచుగా తన హమ్మర్‌లో తిరుగుతూ కనిపిస్తారు. 

రోల్స్ రాయిస్ సిల్వర్ షాడో

ధోని 2021లో తన కార్ గ్యారేజీలోకి రోల్స్ రాయిస్ సిల్వర్ షాడోను తీసుకువ‌చ్చారు. ఈ కారు 6230 cc 6.2 L 410 V8 కు చెందిన శ‌క్తివంత‌మైన‌ ఇంజిన్‌తో న‌డుస్తుంది. 

ఫెరారీ 599 GTO

ధోనీ కార్ల‌ సేకరణలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి ఫెరారీ GTO. ధీని ధ‌ర ధర INR 139 లక్షలు. ఇది కేవలం 3.3 సెకన్లలో 100km/h వేగాన్ని అందుకోగలదు.

జీప్ గ్రాండ్ చెరోకీ ట్రాక్‌హాక్

2019లో లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ కొనుగోలు చేసిన జీప్ చెరోకీ ట్రాక్‌హాక్ 6.2-లీటర్ సూపర్ఛార్జ్‌డ్ V8 హెమీ ఇంజిన్‌తో న‌డుస్తుంది. 

మెర్సిడెస్ బెంజ్ GLE

ధోని కార్ల గ్యారేజీలో ఉన్న మ‌రో సూప‌ర్ కారు మెర్సిడెస్ బెంజ్. ఇది త‌న మహారాష్ట్ర నివాసంలో ఉంటుంది. మ‌హారాష్ట్రలో ధోని మెర్సిడెస్‌ను ఉపయోగిస్తారు. 

Latest Videos

click me!