సిక్స‌ర్స్ కింగ్.. క్రిస్ గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన నికోల‌స్ పూర‌న్

First Published Jun 18, 2024, 11:00 PM IST

Nicholas Pooran breaks Chris Gayle's record:  టీ20 ప్రపంచ కప్ 2024లో చివ‌రి లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ స్టార్ ప్లేయ‌ర్ నికోల‌స్ పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో రెండు ప‌రుగుల దూరంలో సెంచ‌రీని కోల్పోయాడు. అయితే, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ ను అధిగ‌మించ‌డంతో పాటు ప‌లు రికార్డులు న‌మోదుచేశాడు. 
 

Nicholas Pooran

Nicholas Pooran breaks Chris Gayle's record: యూనివ‌ర్స‌ల్ బాస్, దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్‌ను అధిగమించి వెస్టిండీస్‌లో అత్యధిక టీ20 పరుగుల స్కోరర్‌గా నిలవ‌డంలో తన శ్ర‌మ‌, కృషి ప్ర‌ధానంగా ఉన్నాయ‌ని హిట్టింగ్ కు మారుపేరుగా నిలుస్తున్న‌ నికోలస్ పూరన్ చెప్పాడు.

Nicholas Pooran

28 ఏళ్ల ఈ ట్రినిడాడియన్ ప్లేయ‌ర్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 2,000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. సోమవారం జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిడీస్ చివ‌రి లీగ్ మ్యాచ్ లో సూప‌ర్ విక్ట‌రీని అందుకుంది. నికోల‌స్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో త‌న చివ‌రి గ్రూప్ మ్యాచ్‌లో విండీస్ 104 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ చిత్తు చేసింది. 

Nicholas Pooran

యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును కూడా నికోల‌స్ పూర‌న్ బ‌ద్ద‌లు కొట్టాడు. సిక్స‌ర్స్ కింగ్ గా నిలిచాడు. టీ ప్ర‌పంచ క‌ప్ 2024 గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ మంగళవారం వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరిగింది.

Nicholas Pooran

2024 టీ20 ప్రపంచకప్‌లోని ఈ 40వ మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 98 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 218 పరుగులు చేసింది. త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాదాడు. 

Nicholas Pooran

అనంతరం భారీ టార్గెట్ ను ఛేదించ‌డానికి దిగిన అఫ్గానిస్థాన్ జట్టు 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (38) మినహా ఆ జ‌ట్టులోని మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించ‌లేక‌పోయారు. దీంతో వెస్టిండీస్ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది తొలి ఓటమి. 

Nicholas Pooran

ఈ మ్యాచ్‌లో నికోలస్ పురాన్ 53 బంతులు ఎదుర్కొని 98 పరుగులతో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. స్ట్రైక్ రేట్ 184.90 తో ప‌రుగుల వ‌ర‌ద పారించిన అత‌ను త‌న ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 8 సిక్స‌ర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా పురన్ నిలిచాడు.

Nicholas Pooran

ఇప్పటి వరకు 92 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన నికోల‌స్ పూర‌న్ మొత్తం 128 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. 79 టీ20 మ్యాచుల్లో క్రిస్ గేల్ 124 సిక్సర్లు కొట్టాడు.

Latest Videos

click me!