టీ20 ప్రపంచకప్ 2026లో ఆడ‌బోయే క్రికెట్ జ‌ట్లు ఏవో తెలుసా?

First Published Jun 18, 2024, 10:32 PM IST

T20 World Cup 2026 Qualified teams : టీ20 ప్రపంచ క‌ప్ 2024లో మొత్తం 20 జ‌ట్లు పాల్గొన్నాయి. ఈసారి మాదిరిగానే 20 జట్లు కూడా 2026 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటాయి. అయితే, రాబోయే సీజ‌న్ కోసం 12 జట్ల ఇప్ప‌టికే అర్హ‌త సాధించ‌గా, మిగ‌తా 8 జ‌ట్లు పోటీ ప‌డ‌నున్నాయి.
 

India , Cricket, T20 World Cup 2026 , T20 World Cup

T20 World Cup 2026 Qualified teams List : అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో లీగ్ ద‌శ మ్యాచ్ లు ముగిశాయి. ఇప్పుడు మ‌రింత ర‌స‌వ‌త్త‌ర‌మైన సూప‌ర్-8 మ్యాచ్ లు జ‌రుగుతున్నాయి. అయితే, ప్రస్తుత ప్రపంచకప్ ఇంకా ముగియలేదు అప్పుడే రాబోయే 2026 టీ20 ప్రపంచకప్‌కు జట్ల ఎంపిక అప్పుడే ఖరారైంది. రెండేళ్ల తర్వాత జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 12 జట్లు తమ స్థానాలను దక్కించుకోగా, అందులో భారత్ జ‌ట్టు కూడా ఉంది. 

టీ20 ప్రపంచకప్ 2026కు ఆతిథ్య బాధ్యతలను భారత్, శ్రీలంకలు తీసుకున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో శ్రీలంక చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో లీగ్ ద‌శ‌లోనే ఇంటిదారి ప‌ట్టింది. కానీ ఆతిథ్య జట్టుగా ఉండటంతో అది అర్హత సాధించగలిగింది. మరోవైపు టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌ దశలో హ్యాట్రిక్ విజ‌యాల‌తో ముందుకు సాగిన భార‌త జ‌ట్టు గ్రూప్ ఏ లో అగ్రస్థానంలో నిలిచి సూపర్‌-8  దశకు చేరుకుంది. అయితే, ఆతిథ్య జట్టుగా ఉన్న భారత్ 2026లో జరిగే టోర్నీకి కూడా అర్హత సాధించింది.

భార‌త్, శ్రీలంక‌ల‌తో పాటు నేరుగా అర్హత సాధించిన జ‌ట్ల‌తో అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ లు కూడా ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్రస్తుత ప్రపంచ కప్‌లో తమ ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నాయి. సూపర్-8లోకి ప్రవేశించడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్, అమెరికా జ‌ట్లు 2026 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. అలాగే, సూపర్-8 కు చేరుకోవడం ద్వారా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు కూడా అర్హ‌త సాధించాయి. 

ఒకవైపు అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ వంటి జట్లు తమ అద్భుత‌మైన‌ ప్రదర్శనతో 2026 టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించగా, చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో వెనుదిరిగిన‌ న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు 2026లో జరిగే టోర్నీకి అర్హ‌త సాధించాయి. ఐసీసీ టీ20 ర్యాంకింగ్‌ ఆధారంగా ఈ రెండు జ‌ట్లు రాబోయే మెగా టోర్నీకి అర్హ‌త సాధించాయి. ఐర్లాండ్ జట్టు కూడా ర్యాంకింగ్ ఆధారంగా అర్హ‌త పొందింది. 

2026 టీ20 ప్రపంచకప్‌లో కూడా మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. అలాగే, భార‌త్, శ్రీలంక సంయుక్తంగా అతిథ్యం ఇవ్వ‌నున్నాయి. ఇప్ప‌టికే ఈ మెగా టోర్నమెంట్‌లో పాల్గొనడానికి 12 జట్లు అర్హ‌త సాధించాయి. మిగిలిన 8 జ‌ట్లు ప్రాంతీయ క్వాలిఫైయర్ల ద్వారా టోర్నమెంట్‌లోకి వ‌స్తాయి. 

2026లో జరిగే టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన 12 జ‌ట్ల‌లో భారత్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ లు ఉన్నాయి.

Latest Videos

click me!