Suryakumar Yadav
Suryakumar Yadav injured : టీ20 వరల్డ్ కప్ లో భారత్ లీగ్ మ్యాచ్ లలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు చేరుకుంది. ఇప్పుడు భారత్ తన తొలి సూపర్ 8 మ్యాచ్ లో జూన్ 20న గురువారం అఫ్గానిస్థాన్ తో తలపడనుంది.
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు లీగ్ దశలో 4 మ్యాచ్ ల్లో 3 గెలిచి రెండో రౌండ్ కు చేరుకుంది. కెనడాతో జరిగిన నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.
సూపర్ 8 మ్యాచ్ ల కోసం కరేబియన్ దీవులకు వెళ్లిన భారత్.. అక్కడికి చేరుకోగానే గ్రౌండ్ లోకి దిగింది. ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే, సెయింట్ లూసియాలో నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా సూర్యకుమార్ యాదవ్ చేతికి దెబ్బ తగలడంతో భారత్ కు బిగ్ షాక్ తగిలింది.
Suryakumar Yadav
అమెరికాపై సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ కు దెబ్బతగలడం భారత అభిమానుల్లో ఆందోళనలు పెంచింది. అయితే, సూర్య ప్రస్తుతం ఫిట్ గానే ఉన్నాడనీ, గాయం ఆందోళన ఉండదని టీమిండియా భావిస్తోంది.
సూర్య అమెరికాపై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారత్ 39/3తో కష్టాల్లో ఉన్న సమయంలో సూర్యకుమార్ వచ్చి అజేయంగా 50 పరుగులు చేసి 18.2 ఓవర్లలో 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందించాడు.
భారత్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 షెడ్యూల్ గమనిస్తే తన తొలి మ్యాచ్ ను జూన్ 20న అఫ్గానిస్థాన్ తో ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ 8కి చేరుకున్నాయి.
సూపర్-8 లో టీమిండియా షెడ్యూల్ ఇదే..
జూన్ 20: బార్బడోస్ లోని బ్రిడ్జ్టౌన్లో భారత్ vs అఫ్గానిస్థాన్
జూన్ 22: ఆంటిగ్వాలోని నార్త్ సౌండ్ లో భారత్ vs బంగ్లాదేశ్
జూన్ 24: సెయింట్ లూసియాలోని గ్రోస్ ఐలెట్ లో భారత్ vs ఆస్ట్రేలియా