Champions Trophy NZ vs BAN: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ తో పాటు న్యూజిలాండ్ కూడా సెమీస్ చేరుకుంది. రచిన్ రవీంద్ర సెంచరీతో బంగ్లాదేశ్ పై పై విజయంతో కీవీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోపీ సెమీస్ లోకి అడుగుపెట్టింది.
Champions Trophy NZ vs BAN: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్ క్రికెట్ జట్టు తన రెండో విజయాన్ని నమోదుచేసింది. దీంతో టీమిండియాతో పాటు న్యూజిలాండ్ కూడా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ లోకి వచ్చింది.
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంలో 25 ఏళ్ల కీవీస్ యంగ్ బ్యాట్స్‌మన్ రచిన్ రవీంద్ర కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ విన్నింగ్ సెంచరీ సాధించాడు. కివీస్ జట్టు గెలుపుతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు రెండూ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ రేసు నుంచి ఔట్ అయ్యాయి.
24
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. కివీస్ జట్టు స్టార్ బౌలర్ మైఖేల్ బ్రేస్‌వెల్ తన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను చిత్తు చేశాడు. అతను కీలకమైన 4 వికెట్లు తీసుకున్నాడు. అతనికి తోడుగా విలియం ఓ'రూర్కే 2 వికెట్లు పడగొట్టగా, జేమిసన్, మాట్ హెన్రీ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
34
బంగ్లాదేశ్ తరఫున, కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో ఒక చివరను పట్టుకున్నాడు. మరో ఎండ్ నుండి చూస్తే బంగ్లాదేశ్ జట్టు పేక ముక్కలా కనిపించింది. శాంటో 77 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక సమయంలో, జాకీర్ అలీ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ దురదృష్టం కారణంగా, అతను 45 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. మొత్తంగా బంగ్లాదేశ్ జట్టు న్యూజిలాండ్‌కు 236 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.
44
రచిన్ రవీంద్ర సెంచరీతో అదరగొట్టాడు
న్యూజిలాండ్ యంగ్ బ్యాట్స్‌మన్ రచిన్ రవీంద్ర ఎప్పటిలాగే ఐసీసీ ఈవెంట్‌లో మరోసారి మెరిశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. కానీ, అద్భుతమైన కమ్ బ్యాక్ తో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో దంచికొట్టాడు. తనదైన క్లాసిక్ ఇన్నింగ్స్ తో సెంచరీ పూర్తి చేశాడు.
రచిన్ రవీంద్ర 105 బంతుల్లో 112 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. టామ్ లాథమ్ కూడా 56 పరుగులతో అర్ధ సెంచరీ చేసి విజయాన్ని సులభతరం చేశాడు. ఈ గెలుపుతో కివీస్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. మార్చి 2న భారత్‌తో లీగ్ మ్యాచ్ లో తలపడనుంది.