India cricket 2024 schedule
Team India 2024 Schedule: భారత్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు కొత్త సంవత్సరం మూడో రోజు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఓడిన భారత జట్టు ఈ టెస్టులో గెలిస్తే సిరీస్ ను సమం చేస్తుంది. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత అఫ్గానిస్థాన్ తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ 2024 దృష్ట్యా ఈ సిరీస్ చాలా కీలకం.
India , Cricket, virat kohli
2023 సంవత్సరం ముగిసింది. గత ఏడాది భారత జట్టు రెండు ప్రపంచకప్లను చేజార్చుకుంది. అయితే, 2024లో వరల్డ్ కప్ కూడా ఉంది. అలాగే, పలు కీలకమైన ద్వైపాక్షిక సిరీస్ లను ఆడనుంది. ఇక టీమిండియా ముందు 2024లో చాలా సవాళ్లే ఉన్నాయని చెప్పవచ్చు.
india cricket
2023లో నిరాశపరిచిన భారత క్రికెట్ జట్టు ముందు 2024లో వరుస సవాళ్లు గమనిస్తే.. గతేడాది దాదాపు అన్ని ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా కప్ గెలిచిన టీమ్ఇండియా టెస్టు, వన్డే ప్రపంచకప్ లను మాత్రం గెలుచుకోలేకపోయింది. ఈ నిరాశలోనే 2023కి గుడ్ బై చెప్పి 2024కి స్వాగతం పలికారు. ఈ ఏడాది కూడా భారత క్రికెట్ బిజీ షెడ్యూల్ ఉంది. ప్రపంచకప్ సహా అనేక సిరీస్లు ఆడనుంది.
జనవరి-ఫిబ్రవరిలో భారత్ కు రానున్న ఇంగ్లాండ్
జనవరి నెలాఖరు, ఫిబ్రవరి నెలల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్ లో టెస్టు సిరీస్ కోల్పోయిన భారత్ సొంతగడ్డపై విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ ను భారత్ తప్పకుండా గెలవాల్సి ఉంటుంది.
మార్చి-ఏప్రిల్-మేలో ఐపీఎల్ 17వ ఎడిషన్
ఐపీఎల్ 17వ ఎడిషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. కానీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తారు. మార్చి నెలాఖరులో ప్రారంభమై మే నెలాఖరుతో ముగుస్తుంది. 10 జట్లు పాల్గొంటున్న ఈ క్రికెట్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహించనున్నారు.
T20 World Cup 2024
జూన్ లోనే అసలు పోరు.. టీ20 వరల్డ్ కప్ 2024
ఐపీఎల్ ముగిసిన 15 రోజుల తర్వాత జూన్ లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత్ మరో టీ20 ప్రపంచకప్ గెలవలేదు. ఇప్పుడు వెస్టిండీస్-యూఎస్ఏలో జరిగే ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఇక భారత్ జట్టులోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు చోటు కల్పించడం గురించి హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.
భారత్ లో బంగ్లాదేశ్-కివీస్ సిరీస్
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లతో సిరీస్ లను భారత్ ఆడనుంది. ఈ ఏడాది భారత్ లో అత్యధిక సిరీస్ లు ఆడే భారత్ బంగ్లాదేశ్, న్యూజిలాండ్ లతో టెస్టు సిరీస్ లు ఆడనుంది. వైట్ బాల్ క్రికెట్ కూడా ఉంటుంది.
ఈ ఏడాది చివర్లో కంగారూల గడ్డపై భారత్..
2024 చివరలో భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ఆడనుంది టీమిండియా. ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.
టీమిండియా కెప్టెన్ ఎవరు?
ప్రస్తుతం మూడు ఫార్మాట్ల జట్టులో పర్మినెంట్ కెప్టెన్ లేడు. ప్రపంచకప్ ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ అస్తవ్యస్తంగా మారింది. హార్దిక్ పాండ్యా పదేపదే గాయపడటంతో టీ20 కెప్టెన్సీని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఏడాది మూడు ఫార్మాట్లకు ఎవరు సారథ్యం వహిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పెద్ద సవాలును బీసీసీఐ ఎలా ఎదుర్కొంటుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.