క్రికెట్ హంటర్ విరాట్ కోహ్లీ.. సరికొత్త రికార్డులు ఇవే..

First Published | Jan 3, 2024, 10:30 AM IST

Virat Kohli Records: విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్ర‌పంచంలో తిరుగులేని రికార్డుల‌తో దూసుకెళ్తున్న క్రికెట్ దిగ్గ‌జం. త‌న ప‌నైపోయింద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో త‌న బ్యాట్ తోనే స‌మాధాన‌మిస్తూ 2023లో అనేక రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. 2023లో టాప్ గేర్ లో త‌న బ్యాట్ రుచి చూపించి స‌రికొత్త రికార్డులు సృష్టించాడు. 
 

Virat Kohli

Team India-Virat Kohli Records:. విరాట్ కోహ్లీ కెరీర్ లో 2023 ఒక గొప్ప ఏడాదిగా మిగిలింది. ఈ సంవ‌త్స‌రం దిగ్గ‌జ ప్లేయ‌ర్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డంతో పాటు అనేక స‌రికొత్త రికార్డులు సృష్టించాడు. విరాట్ కోహ్లీ 2023లో 35 మ్యాచుల్లో 70 సగటుతో 2048 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 13000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ 267 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, ఆ త‌ర్వాత ఉన్న‌ సచిన్ టెండూల్కర్ 321 ఇన్నింగ్స్‌ల్లో 13 వేల పరుగులు దాటాడు.

Latest Videos


Virat Kohli,Sachin Tendulkar

విరాట్ కోహ్లీ భారత్‌తో సహా మొత్తం 519 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 538 మ్యాచ్‌లతో ధోనీ, 664 మ్యాచ్‌లతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈ ప్లేస్ లో మూడో స్థానంలో ఉన్నాడు.

ఇండియాన్ ప్రీమియ‌ర్ లీగ్ చ‌రిత్ర‌లో కూడా విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో 7000 పరుగులు దాటిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఏడో ఐపీఎల్ సెంచరీతో క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు.

Virat Kohli

వన్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఎవ‌రికీ సాధ్యం కానీ 50 సెంచ‌రీల రికార్డును కూడా న‌మోదుచేశాడు. విరాట్ కోహ్లి తన 50వ వన్డే సెంచరీని ప్ర‌పంచ క‌ప్ లో సాధించాడు. దీంతో దీంతో వ‌న్డేల‌లో అత్య‌ధిక సెంచ‌రీలు కొట్టిన‌ సచిన్ టెండూల్క‌ర్ రికార్డును బద్దలు కొట్టాడు.

విరాట్ కోహ్లీ 2023లో అత్యధికంగా 8 సెంచరీలు సాధించాడు. మొత్తంగా కోహ్లీ 549 ఇన్నింగ్స్ ల్లో 25,000 అంతర్జాతీయ పరుగులు, సచిన్ టెండూల్కర్ కంటే 28 ఇన్నింగ్స్ లు కంటే త‌క్కువ స‌మ‌యంలోనే సాధించాడు. స‌చిన్ 567 ఇన్నింగ్స్ లలో 26,000 పరుగులు సాధించాడు.

ఐసీసీ వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌న బ్యాట్ తో అద‌ర‌గొట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023లో 11 ఇన్నింగ్స్‌ల్లో 765 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఇందులో మూడు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి, 95.62 సగటు తో ప‌రుగుల వ‌ర‌ద‌ పారించాడు.

click me!