రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. టార్గెట్ ఐపీఎల్ 2024 టైటిల్ !

First Published | Jan 3, 2024, 11:17 AM IST

Virat Kohli:  విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, డుప్లెసిస్ వంటి స్టార్ ప్లేయ‌ర్లతో ఐపీఎల్ లో తిరుగులేని జ‌ట్టుగా ఉన్నా.. ఇప్ప‌టివ‌ర‌కు ఒక్కసారి కూడా టైటిల్ గెలుచుకోలేక పోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్. అయితే, ఐపీఎల్ 2024 టైటిల్ టార్గెట్ గా మ‌రోసారి విరాట్ కోహ్లీ ఆర్సీబీ ప‌గ్గాలు చేపట్ట‌బోతున్నాడు.. ! 
 

Image credit: PTI

RCB - Virat Kohli: గత ఏడాది భారత్ లో వన్డే వరల్డ్ క‌ప్ ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ ఇప్పుడు 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)  కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇదే క్ర‌మంలో దుబాయ్ లో జరిగిన మినీ వేలంలో భారీ మొత్తానికి ఆటగాళ్లను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పుడు మరో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

Image credit: PTI

గత 16 సీజన్లుగా టైటిల్ గెలవాలనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ల‌క్ష్యం కలగానే కొనసాగుతోంది. ప్రతిసారీ క‌ప్ మ‌న‌దే.. నినాదంతో తమ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ ఫైనల్ కు చేరకుండా ఏడేళ్లవుతోంది. అయితే 2020, 21, 22 సీజన్లలో ప్లేఆఫ్స్ కు చేరిన ఆర్సీబీ చివరి నిమిషంలో ఘోర పరాజయం చవిచూసింది.


Image credit: PTI

16వ ఎడిషన్ లో ఆర్సీబీ 14 మ్యాచ్లు ఆడి ఏడింటిలో గెలిచి, ఏడింటిలో ఓడింది. ఫలితంగా ఆ జట్టు 2019 తర్వాత లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. ఇదే క్రమంలో ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ గా చేయాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 

Image credit: PTI

డుప్లెసిస్ గత రెండు సీజన్లుగా ఆర్సీబీకి నాయకత్వం వహిస్తున్నాడు. ఫాఫ్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఆడిన 27 మ్యాచుల్లో 14 గెలిచి, 13 మ్యాచ్ల్లో ఓడింది. గత సీజన్లో డుప్లెసిస్ గైర్హాజరీలో విరాట్ కోహ్లీ ఆర్సీబీకి మూడు మ్యాచుల్లో సారథ్యం వహించి విజయం సాధించాడు. అందుకే ఆర్సీబీ ఫ్రాంచైజీ మళ్లీ కోహ్లీకి కెప్టెన్సీ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది.
 

కెప్టెన్సీ భారం కారణంగా విరాట్ కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంటే భారత జట్టుకు, ఆర్సీబీకి నాయకత్వం వహించడం భారంగా మారింది. లీగ్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు కోహ్లీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియాలోని మూడు జట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అంటే ఆయన నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 
 

ఫాఫ్ డుప్లెసిస్ వరుసగా రెండు సీజన్లలో జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ మూడుసార్లు ప్లేఆఫ్స్ కు చేరగా, ఒకసారి ఫైనల్ ఆడింది. 39 ఏళ్ల ఫాఫ్ డుప్లెసిస్ రిటైర్మెంట్ అంచున ఉన్నాడు. ఈ కారణాలన్నింటి కారణంగా ఆర్సీబీ ఫ్రాంచైజీ ఈ ఏడాది ఐపీఎల్లో విరాట్ కోహ్లీకి మళ్లీ కెప్టెన్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.. ! 

Latest Videos

click me!