రిటెన్షన్ తోనే దడపుట్టిస్తున్న ముంబై ఇండియన్స్

Published : Nov 06, 2025, 06:43 PM IST

Mumbai Indians retention list: ముంబై ఇండియన్స్ మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ 2026 కోసం ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసింది. ఛాంపియన్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తో పాటు ఆల్ రౌండర్ ప్లేయర్లు రిటెన్షన్ లిస్టులో ఉన్నారు.

PREV
16
ముంబై ఇండియన్స్ మహిళల జట్టు WPL 2026 రిటెన్షన్ జాబితా విడుదల

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2026 ఎడిషన్‌కు ముందు ముంబై ఇండియన్స్ మహిళల జట్టు తమ రిటైన్డ్ ప్లేయర్ల జాబితాను ప్రకటించింది. జనవరిలో జరగనున్న ఈ టోర్నమెంట్‌లో తొలిసారి మెగా వేలం (Mega Auction) ఫార్మాట్‌లో పోటీలు జరగనున్నాయి.

అయితే, తమ రిటెన్షన్ తోనే ముంబై ఇండియన్స్ జట్టు ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తోంది. 2023, 2025 సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఈసారి కూడా సమతుల్యమైన జట్టుతో ముందుకు సాగేందుకు సిద్ధమైంది.

26
డబ్ల్యూపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్

హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ మహిళల జట్టు డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఈ జట్టు 2023, 2025 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టును ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది. రాబోయే 2026 సీజన్‌లో కూడా అదే రీతిలో బలమైన జట్టును కూర్చుకోవడంపై మేనేజ్‌మెంట్ దృష్టి పెట్టింది.

36
ముంబై ఇండియన్స్ మహిళల WPL 2026 రిటెన్షన్ లిస్టు ఇదే

1. హర్మన్ ప్రీత్ కౌర్ - ₹3.5 కోట్లు (రిటెన్షన్ మొత్తం రూ.)

2. నాట్ సివర్-బ్రంట్ - ₹2.5 కోట్లు

3. అమన్ జోత్ కౌర్ - ₹1.75 కోట్లు

4. హేలీ మాథ్యూస్ - ₹1 కోటి

5. జి కమిలిని - ₹50 లక్షలు

46
డబ్ల్యూపీఎల్ 2026 రిటెన్షన్ రూల్స్ ఏమిటి?

డబ్ల్యూపీఎల్ రిటెన్షన్ నియమాల ప్రకారం, ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ముగ్గురు క్యాప్డ్ భారతీయ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ భారతీయ ఆటగాళ్లను రిటైన్ చేయవచ్చు. మొత్తంగా అయితే, ఒక ఫ్రాంచైజీ ఐదుగురిని రిటైన్ చేస్తే, కనీసం ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఉండాలి.

ఇంకా, 2026 నుండి “రైట్ టు మ్యాచ్” (Right To Match - RTM) ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆప్షన్ ద్వారా ఫ్రాంచైజీలు వేలం సమయంలో తమ పాత ఆటగాళ్లను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఐదుగురిని రిటైన్ చేసినందున, వారికి ఆర్టీఎం ఆప్షన్ లభించదు.

56
రిటెన్షన్ ప్లేయర్ల జీతాల స్లాబ్స్

డబ్ల్యూపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రిటైన్డ్ ప్లేయర్ల జీత స్లాబ్‌లను కూడా ప్రకటించింది.

• ప్లేయర్ 1 – ₹3.5 కోట్లు

• ప్లేయర్ 2 – ₹2.5 కోట్లు

• ప్లేయర్ 3 – ₹1.75 కోట్లు

• ప్లేయర్ 4 – ₹1 కోటి

• ప్లేయర్ 5 – ₹50 లక్షలు

ఒక జట్టు ఐదుగురిని రిటైన్ చేస్తే, వారి ₹15 కోట్ల పర్సు నుండి ₹9.25 కోట్లు తగ్గుతాయి. ముంబై ఇండియన్స్ జట్టు రిటైన్డ్ జాబితా ప్రకారం, వారికి ఇప్పుడు ₹5.75 కోట్లు మాత్రమే మిగిలాయి.

66
డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం ఎప్పుడు?

డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం నవంబర్ 27న ఢిల్లీలో జరగనుంది. ప్రతి జట్టుకు ₹15 కోట్ల పర్సుతో 16 నుంచి 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈసారి మొదటిసారిగా మహిళా ప్రీమియర్ లీగ్ మెగా వేలం ఫార్మాట్‌లో జరగడం విశేషం.

ముంబై ఇండియన్స్ మహిళల జట్టు గత విజయాల మాదిరిగా ఈ సీజన్‌లో కూడా బలమైన ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories