Vaibhav Suryavanshi: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీ అందుకుని ఎమోషనల్ అయ్యారు. కన్నడ రఘు చేతుల మీదుగా సర్ప్రైజ్ బాక్స్ అందుకోగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ లాంగ్ రన్ డ్రీమ్ ఫైనల్‌గా నెరవేరింది. ఇండియా తరఫున ఆడాలనే అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. బీసీసీఐ నుంచి వచ్చిన ఒక స్పెషల్ సర్ప్రైజ్ బాక్స్‌తో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన 'ప్లేయర్ నంబర్ 532', 'జెర్సీ నంబర్ 3' ఉన్న బ్లూ జెర్సీని అతను అందుకున్నాడు. ఈ ఎమోషనల్ మూమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
26
వైభవ్ సూర్యవంశీ కల నిజమైన వేళ
చిన్నప్పటి నుంచి చేతిలో బ్యాట్ పట్టి, క్రికెట్ గ్రౌండ్‌లో రాత్రి పగలు కష్టపడిన వైభవ్ సూర్యవంశీ పెద్ద కల ఈరోజు నిజమైంది. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలనే అతని జర్నీలో ఇదొక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్. జెర్సీని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం మాటల్లో చెప్పలేనివి. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు వైభవ్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది.
36
మాటలు రాని భావోద్వేగం
టీమిండియాకు చెందిన ప్రతిష్ఠాత్మక 'త్రీ స్టార్' బ్లూ జెర్సీని అందుకున్న తర్వాత వైభవ్ తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. "ఈ ఫీలింగ్‌ను నేను మాటల్లో చెప్పలేను. నా ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి నాకు అసలు వర్డ్స్ దొరకడం లేదు" అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక సాధారణ ప్లేయర్ నుంచి ఇండియన్ టీమ్ మెంబర్‌గా మారిన ఆ క్షణం అతని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ప్లేయర్ నంబర్ 532, జెర్సీ నంబర్ 3 తో వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో అఫీషియల్‌గా 'ప్లేయర్ నంబర్ 532' పొజిషన్ దక్కింది. ఇక నుంచి అతను గ్రౌండ్‌లో '3' నంబర్ ఉన్న జెర్సీని వేసుకుని దుమ్మురేపనున్నాడు. ఈ జెర్సీ బ్యాక్ సైడ్ అతని పేరు స్పష్టంగా ప్రింట్ చేసి ఉంది. ఈ నంబర్‌తో అతను ఇండియన్ క్రికెట్‌లో కొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
56
హోటల్ రూమ్‌కు సర్ప్రైజ్ బాక్స్
బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో అసలు ఏం జరిగిందో చూపించారు. బీసీసీఐ లోగో ఉన్న ఒక స్పెషల్ కిట్ బాక్స్‌ను హోటల్ స్టాఫ్ ట్రాలీ ద్వారా వైభవ్ రూమ్‌కు తీసుకొచ్చారు. టీమిండియా స్టాఫ్ మెంబర్, కర్ణాటకలోని ఉత్తర కన్నడ కుమెటా ప్రాంతానికి చెందిన రఘు ఈ జెర్సీ బాక్స్‌ను వైభవ్ రూమ్‌కు స్వయంగా డెలివరీ చేశారు. ఈ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వైభవ్ ఫేస్‌లో క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.
66
నమ్మలేని ఒక అద్భుత అనుభవం
బాక్స్ ఓపెన్ చేసి ఇండియన్ జెర్సీని చేతిలోకి తీసుకోగానే వైభవ్ ముఖంలో ఒక రేంజ్ నవ్వు వచ్చేసింది. "ఈ టీషర్ట్ చూడగానే నా నవ్వు ఆపుకోలేకపోయాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఒక కలలా ఉంది" అని వైభవ్ చెప్పాడు. "కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని వండర్స్ మన లైఫ్‌లో జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. నా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది" అంటూ టీమిండియా త్రీ స్టార్ జెర్సీని టచ్ చేస్తూ వైభవ్ ఫుల్ ఖుషీ అయ్యాడు.