MS Dhoni Army Position and Honorary Salary: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని భారత సైన్యంలో ఉన్నత పదవిని అలంకరించారు. ఆయన ఏ పదవిలో ఉన్నారు? జీతం ఎంత? ఇలాంటి కొన్ని ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
MS Dhoni Army Position and Honorary Salary Explained: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని టీమిండియాకు అనేక విజయాలు అందించారు. 'మిస్టర్ కూల్' గా పేరుగాంచిన ధోని తన ప్రత్యేక నాయకత్వంతో భారత జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. భారత్ కు టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను గెలిపించిన ఏకైక కెప్టెన్ ధోని.
25
ధోని సైన్యంలో ఏ పదవిలో ఉన్నారు?
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ, ధోని ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. దేశం కోసం ఎన్నో విజయాలు సాధించిన ధోనికి భారత సైన్యంలో ఉన్నత పదవి లభించింది. 2011లో ధోనికి లెఫ్టినెంట్ కల్నల్ హోదా లభించింది. క్రికెట్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ధోని జమ్మూ కాశ్మీర్‌లో సైనికులతో కలిసి పనిచేశారు. పారాచూట్ శిక్షణ కూడా తీసుకున్నారు.
35
భారత సైన్యంలో ధోని జీతం ఎంత?
ఇతర సైనిక అధికారుల మాదిరిగానే ధోనికి కూడా జీతం లభిస్తుంది. లెఫ్టినెంట్ కల్నల్‌గా ధోనికి నెలకు రూ.1.21 లక్షల నుంచి రూ.2.12 లక్షల వరకు జీతం అందుతుందని సమాచారం. అయితే, ధోని ఈ జీతాన్ని తీసుకోలేరు. ఎందుకంటే ధోని సైన్యంలో గౌరవ పదవిలో ఉన్నారు. సైనిక అధికారుల సాధారణ విధులను నిర్వర్తించరు. కానీ, అవసరమైన సమయంలో దేశం కోసం ఆర్మీ పనులు చేస్తారు.
ధోనికి నెలవారీ జీతం అని చెప్పినప్పటికీ, ఆయనకు అది అందదు. ధోని మాత్రమే కాదు, సచిన్‌కు కూడా సైన్యంలో గౌరవ పదవి లభించింది. సైనికులను ప్రోత్సహించడానికి, ప్రజలు సైన్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి క్రీడాకారులకు గౌరవ పదవులు ఇస్తున్నారు.
55
కాగా, ధోని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో ధోని ఉన్నాడు. ప్రస్తుతం చెన్నై టీమ్ కు కెప్టెన్ గా కొనసాగుతున్న ధోనిని.. ఐపీఎల్ మెగా వేలంలో ఆ టీమ్ 4 కోట్ల రూపాయలకు కోనుగోలు చేసింది.