షమీ ఎమోషనల్ రిటైర్మెంట్ ప్రకటన..
''ఆ దేవుడికి (అల్లాకు) థ్యాంక్స్ చెబుతున్నాను... ఆయన నాకు ఊహించినదానికంటే ఎక్కువే ఇచ్చాడు. అమ్మానాన్న, కుటుంబసభ్యులు, స్నేహితులకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ క్రికెట్ జర్నీలో దేశానికి తనవంతుగా ఎంతోకొంత కాంట్రిబ్యూట్ చేశాను. 13 ఏళ్లపాటు టెస్ట్ క్రికెట్లో నా సుదీర్ఘ ప్రయాణం సాగింది.
చిన్నగ్రామం నుండి మొదలైన నా క్రికెట్ ప్రయాణం ఈ స్థాయికి చేరుకోవడం గొప్పవిషయం. నేను చాలా కష్టపడ్డాను, ఎన్నో ఎత్తపల్లాలు చూశాను.. చివరికి ఇదేరోజు (6 నవంబర్) నాకు టెస్ట్ క్యాప్, బాల్ చేతికివచ్చాయి (టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టాను). చాలా కష్టపడ్డాక టెస్ట్ నంబర్ 279 దక్కింది. ఈ క్యాప్, ఈ బాల్ మహ్మద్ షమీకి పేరు తెచ్చాయి. ఈ ప్రయాణంలో కిందపడ్డాను, దెబ్బలుతాకాయి... కానీ మళ్లీ లేచి నిలబడ్డాను.
నా 13 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం అద్భుతంగా సాగింది. నా కోచ్ లు, ట్రైనర్లు, సహాయ సిబ్బంది ఇలా అందరూ తనను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా తనను ఇంతలా అభిమానించిన క్రికెట్ అభిమానులకు ధన్యవాదాలు. వారి ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇక ఈ బంతి, క్యాప్ ను వదిలిపెడుతున్నాను... కానీ ఇతర ఫార్మాట్స్ లో కొనసాగుతాను.'' అంటూ ఓ వీడియో సందేశాన్ని షమీ విడుదలచేశాడు.