MI vs KKR: టాస్ గెలిచిన ముంబై.. జట్టులో కీలక మార్పులు
ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠ పోరుకు తెరలేసింది. రెండు దిగ్గజ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది..
ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠ పోరుకు తెరలేసింది. రెండు దిగ్గజ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమవుతోంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది..
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠ పోరు జరుగుతోంది. ఐదు సార్లు ఛాంపియన్ ముంబై, మూడు టైటిల్స్ గెలిచిన కోల్‌కతాతో తలపడుతోంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకోగా, కోల్‌కతా బ్యాటింగ్ ప్రారంభించనుంది. ముంబై జట్టులో అశ్విని కుమార్ తొలి మ్యాచ్ ఆడనున్నాడు, అలాగే విఘ్నేష్ పుత్తూరుకు కూడా ప్లేయింగ్-11లో చోటు దక్కింది.
మరోవైపు కోల్‌కతా జట్టు కీలక ఆటగాడు సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి చేరాడు. అనారోగ్య కారణంగా ఆయన గత మ్యాచ్ ఆడలేదు. ఈ మ్యాచ్ ముంబై హోమ్‌గ్రౌండ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుండడం విశేషం. వరుసగా రెండు ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని భావిస్తోంది. కోల్‌కతా ఇప్పటికే ఓ విజయంతో ముందంజలో ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డు:
కోల్‌కతాపై ముంబైకి భారీ ఆధిక్యం ఉంది. ఇప్పటివరకు జరిగిన 34 మ్యాచ్‌ల్లో ముంబై 23 విజయాలు సాధించగా, కోల్‌కతా కేవలం 11సార్లు మాత్రమే నెగ్గింది. అయితే, ఇటీవల కోల్‌కతా ఫామ్ మారిపోయింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి 6 మ్యాచుల్లో కోల్‌కతా 5 విజయాలు నమోదు చేసింది. ముంబై బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరంగా ఉండగా, కోల్‌కతాకు ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అందుబాటులోకి రావడం జట్టుకు అదనపు బలం ఇచ్చింది.
ప్లేయింగ్ XI:
కోల్‌కతా నైట్ రైడర్స్:
క్వింటన్ డి కాక్ (w), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే (c), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా,
వరుణ్ చక్రవర్తి
ముంబై ఇండియన్స్:
ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ (w), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (c), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్, విఘ్నేష్ పుత్తూర్