MI vs KKR Match
ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తొలిసారి సొంత మైదానంలో ఆడబోతోంది. ముంబై, కోల్‌కతాల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్‌కి ముంబైలోని వాంఖడే స్టేడియం సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పూర్తిగా సన్నద్ధమయ్యాయి. దీంతో వాంఖడే స్టేడియంలో జరగబోయే ఈ మ్యాచ్‌పై అందరి దృష్టిపడింది.
Mumbai Indians
విజయ పరంపర కొనసాగించాలని కోల్‌కతా:
కోల్‌కతా నైట్ రైడర్స్ విజయపరంపరను కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది. సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైన కోల్‌కతా.. రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. కాగా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై మరోసారి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది.
KKR
విజయ పరంపర కొనసాగించాలని కోల్‌కతా:
కోల్‌కతా నైట్ రైడర్స్ విజయపరంపరను కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది. సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైన కోల్‌కతా.. రాజస్థాన్ రాయల్స్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకొని ఈ సీజన్‌లో బోణీ కొట్టింది. కాగా ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై మరోసారి విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది.
ముంబై వర్సెస్ కోల్‌కతా మధ్య గణంకాలు ఎలా ఉన్నాయి.?
ఐపీఎల్ చరిత్రలో ముంబై, కోల్‌కతాల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ముంబైదే ఆదధిపత్యం ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 23 మ్యాచ్‌ల్లో గెలిచింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఈ రోజు మ్యాచ్‌లో ఎవరు గెలవొచ్చు.?
రెండు జట్లు సమాన బలాలతో ఉంది. దీంతో రెండు జట్లలో విజయం ఎవరిది అనే విషయం చెప్పడం అంత సులభం కాదు. అయితే ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విజయాన్ని అందుకోకపోవడం, ట్రాక్ రికార్డ్ పరంగా చూసినా కోల్‌కతాపై ముంబైదే పైచేయి ఉండడంతో ముంబైకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. వాంఖడే పిచ్ కూడా ముంబై టీమ్‌కి కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు.
ఇరు జట్ల ప్లేయర్స్:
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, సత్యనారాయణ రాజు.
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), మోయిన్ అలీ, అజింక్య రహానే (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా.