Mumbai Indians
ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిని చవి చూసింది. తొలి మ్యాచ్ చెన్నై, రెండో మ్యాచ్ గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవి చూసింది. దీంతో అందరి దృష్టి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌పై పడింది. సీజన్‌లో తొలిసారి సొంత గ్రౌండ్‌లో ఆడుతోన్న ముంబై ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని కసితో ఉంది. అయితే ముంబై విజయం సాధించాలంటే కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
Image Credit: ANI
ముంబై ఇండియన్స్ను ఓపెనర్లు సరైన ఆరంభాన్ని ఇవ్వలేకపోతున్నారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ.. ఓపెనర్లు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. రెండు సార్లు రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే అవుట్ అయ్యాడు. అందుకే కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఓపెనర్లు కచ్చితంగా రాణించాలి. ఇద్దరిలో ఒక్కరు స్టాండింగ్ ఇచ్చినా మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు.
తొలి మ్యాచ్‌లో అద్భుతంగా బంతులు విసిరిన విఘ్నేశ్ రెండో మ్యాచ్ ఆడలేదు. మరి ఈరోజైనా తీసుకుంటారా లేదా చూడాలి. ఇక రాబిన్ మింజ్, సత్యనారాయణ రాజు ఆశించిన ప్రభావం చూపలేకపోతున్నారు. కాబట్టి వీరి ఆటతీరు మెరుగుపడాల్సి ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి ఇద్దరు ఉత్తమ పవర్ ప్లే బౌలర్లు ఉన్నారు. రెండు మ్యాచ్‌లలో జట్టు పవర్ ప్లేలో చాలా పరుగులు ఇచ్చింది.
Mumbai Indians
మంచి బ్యాటింగ్ లైన్‌తో పటిష్టంగా ఉన్న కేకేఆర్‌ను కట్టడి చేయాలంటే పవర్ ప్లేలో సమర్థవంతమైన బౌలింగ్ పడాల్సి ఉంటుంది. ఇక గడిచిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై మిడిలార్డర్ బ్యాటర్లు స్ట్రైక్‌ను రొటేట్ చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా 10 నుంచి 15 ఓవర్లలో స్ట్రైక్ రొటేషన్ చాలా ముఖ్యం. అలా అయితేనే స్కోర్ బోర్డు పరుగులు పెడుతుంది. కాబట్టి వీటన్నింటిలో ముంబై సక్సెస్ అయితే టీమ్ విజయం సాధించడం పెద్ద కష్టమేమి కాదు.