RR vs CSK: ధోని-జడేజాలు చెన్నైని గెలిపించలేకపోయారు.. రాజ‌స్థాన్ సూప‌ర్ విక్ట‌రీ

IPL 2025 RR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 11వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన ప్రదర్శనతో చెన్నై సూప‌ర్ కింగ్స్ పై విజ‌యం సాధించింది. నితీష్ రాణా, జోఫ్రా ఆర్చర్ లు ఈ గెలుపులో హీరోలుగా నిలిచాడు. 

IPL RR vs CSK: MS Dhoni-Jadeja could not make Chennai Super Kings win.. Rajasthan Royals's super victory in telugu rma
CSK vs RR

RR vs CSK IPL 2025: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తొలి విజ‌యాన్ని అందుకుంది. ఐపీఎల్ 2025 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని సాధించింది.

ఆదివారం (మార్చి 30) గౌహతిలో జరిగిన చివరి ఓవర్ వ‌ర‌కు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో ఆర్ఆర్ సూప‌ర్ విక్ట‌రీ అందుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓట‌మిపాలైన రాజ‌స్థాన్ ఇప్పుడు చెన్నైపై విజ‌యం సాధించింది.

IPL RR vs CSK: MS Dhoni-Jadeja could not make Chennai Super Kings win.. Rajasthan Royals's super victory in telugu rma
IPL RR vs CSK: MS Dhoni-Jadeja could not make Chennai Super Kings win.. Rajasthan Royals's super victory

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తర్వాత చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది.

చివరి ఓవర్లో గెలవడానికి 20 పరుగులు అవసరం కాగా, మహేంద్ర సింగ్ ధోని మొదటి బంతికే ఔట్ కావడంతో చెన్నై ఆశలు ఆవిరయ్యాయి. జేమీ ఓవర్టన్ సిక్స్ కొట్టడం ద్వారా జట్టును తిరిగి మ్యాచ్‌లోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు, కానీ గెలుపు కోసం మ్యాజిక్ చేయ‌లేక‌పోయాడు. 


IPL RR vs CSK: MS Dhoni-Jadeja could not make Chennai Super Kings win.. Rajasthan Royals's super victory

కీల‌క స‌మ‌య‌లో ధోని బ్యాటింగ్ కు వ‌చ్చాడు. అత‌ను క్రీజులోకి వచ్చే సమయానికి చెన్నై జట్టుకు 4 ఓవర్లలో 54 పరుగులు అవసరం. అతను జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు 20 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు కానీ అతని ప్రయత్నాలు జట్టును విజ‌య‌తీరాలకు చేర్చ‌లేదు. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్లో షిమ్రాన్ హెట్మేయ‌ర్ కు క్యాచ్ ఇచ్చి ధోని అవుట్ అయ్యాడు. అతను 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు. ఒక ఫోర్, ఒక సిక్స్ బాదాడు. రవీంద్ర జడేజా 22 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతను 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. జేమీ ఓవర్టన్ 4 బంతుల్లో 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

MS Dhoni-Jadeja could not make Chennai Super Kings win.. Rajasthan Royals's super victory

చెన్నై జట్టు టాప్-5 బ్యాట్స్‌మెన్‌లలో రుతురాజ్ గైక్వాడ్  మాత్ర‌మే మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు. అతను 44 బంతుల్లో 63 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్స‌ర్ బాదాడు. రాహుల్ త్రిపాఠి, శివం దూబే మంచి ఆరంభాన్ని పొందారు, కానీ ఇద్దరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. త్రిపాఠి 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. శివం దూబే 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఓపెనర్ రచిన్ రవీంద్ర ఖాతా తెరవలేకపోయాడు.

విజయ్ శంకర్ 9 పరుగులు వ‌ద్ద అవుట్ అయ్యాడు. రాజస్థాన్ తరఫున వానిందు హసరంగా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మలు అద్భుత‌మైన బౌలింగ్ తో అద‌ర‌గొట్టారు.

రాజ‌స్థాన్ బ్యాటింగ్ విష‌యానికి వ‌స్తే నితీష్ రాణా అద్భుత‌మైన ఇన్నింగ్స్ ను ఆడాడు. కేవ‌లం 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ను ఆడాడు. 225 స్ట్రైక్ రేటుతో తన ఆటను కొనసాగించాడు. రియాన్ ప‌రాగ్ 37 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

Latest Videos

vuukle one pixel image
click me!