కేకేఆర్ వ‌ద్దంటే.. ఆర్ఆర్ త‌ర‌ఫున 225 స్ట్రైక్ రేటుతో సునామీ రేపిన నితీష్ రాణా

Nitish Rana: ఐపీఎల్ లో  కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ద్ద‌నుకుంటే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ లోకి వ‌చ్చి సునామీ ఇన్నింగ్స్ తో ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు నితీష్ రాణా. చెన్నై సూప‌ర్ కింగ్స్ పై ధనాధన్ ఇన్నింగ్స్ తో సూప‌ర్ నాక్ ఆడాడు. 
 

Nitish Rana

IPL 2025 RR vs CSK Nitish Rana: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ -  చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. రాజస్థాన్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా గౌహతిలో తుఫాను ఇన్నింగ్స్ దుమ్మురేపాడు. చెన్నై బౌలర్లను దంచికొట్టాడు. ఐపీఎల్ లో  కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ద్ద‌నుకుంటే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ లోకి వ‌చ్చి సూపర్ నాక్ తో ప‌రుగుల వ‌ర్షం కురిపించాడు. కేవ‌లం 36 బంతుల్లో 81 పరుగులతో అద్భుత‌మైన ఇన్నింగ్స్ ను ఆడాడు.

రాణా కేవలం 21 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ లో 3వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పవర్‌ప్లేలో హాఫ్ సెంచ‌రీ కొట్టిన‌ మొదటి రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మన్ ఘ‌న‌త సాధించాడు. 

IPL RR vs CSK: Nitish Rana played a tsunami innings for RR with a strike rate of 225

ఐపీఎల్‌లో 3వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పవర్‌ప్లేలో అర్ధ సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సురేష్ రైనా, మోయిన్ అలీ, అజింక్య రహానె, వృద్ధిమాన్ సాహా వంటి ఆటగాళ్లు ఉన్నారు. నితీష్ రాణా ఇప్పుడు అలా చేసిన ఐదవ బ్యాట్స్‌మన్ ఘ‌న‌త సాధించాడు. 

ఐపీఎల్‌లో 3వ స్థానంలో లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పవర్‌ప్లేలో హాఫ్ సెంచ‌రీలు కొట్టిన ప్లేయ‌ర్లు 

87*(25) - సురేష్ రైనా (CSK) vs PBKS, ముంబై WS, 2014 Q2
59*(21) - మోయిన్ అలీ (CSK) vs RR, బ్రబోర్న్, 2022
58*(22) - నితీష్ రాణా (RR) vs CSK, గౌహతి, 2025
53*(20) - అజింక్య రహానె (CSK) vs MI, ముంబై, 2023
52*(23) - వృద్ధిమాన్ సాహా (PBKS) vs SRH, హైదరాబాద్, 2014


Nitish Rana played a tsunami innings for RR with a strike rate of 225

అర్ధ సెంచరీ సాధించిన తర్వాత నితీష్ తన బ్యాట్‌తో బేబీ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నాడు. త్వరలో అత‌ను తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య సచి మార్వా కవలలకు తల్లి కాబోతోంది. గ‌తంలో కేకేఆర్ త‌ర‌ఫున అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడిన‌ప్ప‌టికీ ఆ టీమ్ వ‌దులుకుంది. దీంతో ఐపీఎల్ మెగా వేలంలో అత‌న్ని రాజస్థాన్ రాయల్స్ రూ.4.20 కోట్ల‌కు ద‌క్కించుకుంది. 

ఐపీఎల్ 2025లో నితీష్ రాణా రాజస్థాన్ రాయ‌ల్స్ త‌ర‌ఫున 2 మ్యాచ్‌లు ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ 2లో 8 బంతుల్లో 11 పరుగులు చేశాడు. ఆ త‌ర్వాత ఐపీఎల్ 11వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగుల సూప‌ర్ ఇన్నింగ్స్ ను ఆడాడు. 225 స్ట్రైక్ రేటుతో తన ఆటను కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ 2025 లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీలలో ఒకదాన్ని కూడా నమోదు చేశాడు.

Latest Videos

click me!