Published : Oct 17, 2021, 10:42 PM ISTUpdated : Oct 17, 2021, 11:06 PM IST
ఐపీఎల్ 2021 సీజన్‌ను టైటిల్ విన్నింగ్ కెప్టెన్‌గా ముగించిన మహేంద్ర సింగ్ ధోనీ, మెంటర్‌గా కొత్త అవతారం ఎత్తాడు. ఐపీఎల్ బయో బబుల్‌ని వీడిన ధోనీ, యూఏఈలోని భారత క్రికెట్ జట్టు బయో బబుల్‌లో చేరాడు.
గత ఆరు టోర్నీల్లో భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ లేకుండా టీమిండియా ఆడబోయే తొలి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఇదే...
28
కెప్టెన్‌గా 2007 టీ20 వరల్డ్‌కప్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, మెంటర్‌గా భారత జట్టుతో ఉన్న టీమిండియాలో కొండంత బలం, రెట్టింపు ఉత్సాహం ఉప్పొంగుతాయని భావించిన బీసీసీఐ, మాహీని మెంటర్‌గా ఉండేందుకు ఒప్పించిన విషయం తెలిసిందే...
38
భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు అధికారికంగా ఇదే ఆఖరి టోర్నమెంట్ కానుంది...
48
అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్ల కూడా సారథి ఆడుతున్న మొట్టమొదటి, చివరి టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఇదే. ఇప్పటికే విరాట్ కోహ్లీ, టీ20 కెప్టెన్‌గా వైదొలుగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే...
58
హెడ్ కోచ్‌తో పాటు కోచింగ్ సిబ్బంది అంతా టీమిండియాకి తోడుగా ఉండడంతో మెంటర్‌గా మాహీ ఏం చేస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది...
68
కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ గురించి, టీమ్ సెలక్షన్ గురించి, గేమ్ ప్లాన్ గురించి భారత జట్టుతో మాహీ డిస్కర్షన్ చేసే అవకాశం ఉంది..
78
దీంతో పాటు టీమిండయాలోని యువ ఆటగాళ్ళకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ... మెంటర్‌గా తన పాత్ర పోషించబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...
88
మెంటర్‌గా టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైనప్పటికీ, ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి మాహీ నయా పైసా కూడా తీసుకోవడం లేదని బీసీసీఐ సెక్రటరీ జే షా ప్రకటించిన విషయం తెలిసిందే...