‘చిన్నస్వామి’కి వచ్చిన అభిమనులపై పెద్దమనసు చూపిన కర్నాటక క్రికెట్ అసోసియేషన్.. టికెట్ డబ్బులు వాపస్

Published : Jun 20, 2022, 12:10 PM IST

IND vs SA 5th T20I: ఇండియా-సౌతాఫ్రికా మధ్య ఆదివారం సిరీస్ నిర్ణాయత్మక టీ20 మ్యాచ్ వర్షార్పణం అయిన విషయం తెలిసిందే. దీంతో కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. 

PREV
17
‘చిన్నస్వామి’కి వచ్చిన అభిమనులపై పెద్దమనసు చూపిన కర్నాటక క్రికెట్ అసోసియేషన్.. టికెట్ డబ్బులు వాపస్

తలో రెండు మ్యాచులు గెలిచి సిరీస్ విజేతను తేల్చే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గెలుపెవరిదో చూద్దామని వచ్చిన క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిలింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. 

27

రాత్రి ఏడింటికి ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. తొలుత వర్షం వల్ల  45 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది.  3 ఓవర్లు పడ్డాయో లేదో తిరిగి వర్షం మొదలైంది. సుమారు రెండు గంటలు వేచి చూసినా వర్షం వదలకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేసి సిరీస్ ను 2-2 తో ఇరు జట్లు సమానంగా పంచుకున్నాయి. 

37

అయితే సిరీస్ డిసైడర్ లో మ్యాచ్ చూద్దామని చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తిన అభిమానులకు  తీవ్ర నిరాశ ఎదురైంది.  మ్యాచ్ జరగకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. వేలకు వేలు పెట్టి మ్యాచ్ చూడటానికి వస్తే వాన తమ ఆశలపై నీళ్లు చల్లిందని ఆవేదన చెందుతున్నారు. 

47

ఇప్పుడు వాళ్లకు కర్నాటక క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. టికెట్ రేట్లలో 50 శాతం రీఫండ్ చేయనున్నట్టు కేఎస్సీఏ అధికార ప్రతినిధి  వినయ్ మృత్యుంజయ తెలిపారు. 

57

ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ వర్షార్పణం అయినందుకు  మేము చింతిస్తున్నాం.  నిబంధనల ప్రకారమైతే మ్యాచ్ లో ఒక్క బంతి పడ్డా టికెట్ డబ్బులను వెనక్కి తిరిగివ్వరు. కానీ అభిమానులకు కాస్త స్వాంతన చేకూర్చేందుకు గాను మేము వారి టికెట్ డబ్బుల్లో 50 శాతం తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం..’ అని తెలిపారు. 
 

67

త్వరలోనే టికెట్ రీఫండ్ కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తామని.. టికెట్లను కొన్న అభిమానులు వారికి సూచించిన మార్గదర్శకాలను అనుసరించి నగదు తీసుకోవాలని మృత్యుంజయ కోరారు. అయితే నగదు రీఫండ్ చేసుకునేప్పుడు అభిమానులు తమ ఒరిజినల్ టికెట్లను వెంట తెచ్చుకోవాలని సూచించారు. 

77

ఇక దక్షిణాఫ్రికాతో ముగిసిన నాలుగు మ్యాచులలో టీమిండియా తొలి రెండు టీ20లు ఓడి ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న విషయం తెలిసిందే.  ఢిల్లీ, కటక్ లలో ఓడినా.. తిరిగి వైజాగ్, రాజ్కోట్ లలో గెలిచి సిరీస్ ను 2-2తో సమం చేసింది. 
 

Read more Photos on
click me!

Recommended Stories