సెల్ఫీ కోసం వచ్చిన గ్రౌండ్‌మెన్‌ని తోసేసిన రుతురాజ్ గైక్వాడ్... సోషల్ మీడియాలో ట్రోల్స్...

Published : Jun 20, 2022, 11:36 AM IST

ఐపీఎల్, దేశవాళీ ట్రోఫీల్లో నిలకడైన పర్ఫామెన్స్‌తో టీమిండియాలోకి వచ్చిన యంగ్‌స్టర్ రుతురాజ్ గైక్వాడ్. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్, 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. తాజాగా వర్షం కారణంగా రద్దయిన బెంగళూరు టీ0లో రుతురాజ్ గైక్వాడ్ ప్రవర్తన వివాదాస్పదమైంది...

PREV
19
సెల్ఫీ కోసం వచ్చిన గ్రౌండ్‌మెన్‌ని తోసేసిన రుతురాజ్ గైక్వాడ్... సోషల్ మీడియాలో ట్రోల్స్...

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. టాస్ వేసిన తర్వాత సరిగ్గా మ్యాచ్ ఆరంభానికి వర్షం ఆరంభం కావడంతో ఆటగాళ్లు డగౌట్‌లో కూర్చొని... వాన ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూశారు...

29
Ruturaj Gaikwad

ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ హెల్మెట్, బ్యాటుతో బ్యాటింగ్‌కి సిద్ధంగా ఉండడాన్ని గమనించిన ఓ గ్రౌండ్‌మెన్, అతని పక్కన కూర్చొన సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే గ్రౌండ్‌మెన్‌ని తోసేసిన రుతురాజ్ గైక్వాడ్, అక్కడ నుంచి వెళ్లాల్సిందిగా వారించాడు...

39
Image credit: PTI

ఈ సంఘటన లైవ్‌లో టీవీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో రుతురాజ్ గైక్వాడ్ ప్రవర్తనను విమర్శించి, తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. గ్రౌండ్‌ను ఆటకు సిద్ధంగా ఉంచేందుకు గ్రౌండ్‌మెన్ చాలా కష్టపడుతారు. వర్షం పడిన సమయాల్లో అయితే వారి కష్టానికి వెలకట్టలేం...

49
Image credit: PTI

అలాంటి గ్రౌండ్‌మెన్‌తో ఇలా దురుసుగా ప్రవర్తించడం సరికాదని, రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదని అంటున్నారు నెటిజన్లు. అతన్ని వెంటనే టీమిండియా నుంచి తప్పించాలని అంటున్నారు...

59
Image credit: PTI

సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో బయో బబుల్ నిబంధనలు అమలులో లేవు. ఇంతకుముందులా భారత క్రికెటర్లు, బయటి వ్యక్తులను కలవకూడదనే ఆంక్షలు కూడా లేవు. అలాంటప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌, గ్రౌండ్‌మెన్‌కి సెల్ఫీ ఇవ్వడం ఇష్టం లేకపోకపోతే కాస్త సౌమ్యంగా చెప్పాల్సిందని అంటున్నారు మరికొందరు..

69
Image credit: PTI

మ్యాచ్ సజావుగా నిర్వహించడానికి ఎంతో కష్టపడే గ్రౌండ్‌మెన్‌తో ఎలా నడుచుకోవాలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, భారత క్రికెటర్లు సంజూ శాంసన్ వంటి వాళ్లను చూసి తెలుసుకోవాలని హితవు చేస్తున్నారు... 

79

అయితే ఈ విషయంలో కొందరు రుతురాజ్ గైక్వాడ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు కరోనా బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్, వెస్టిండీస్‌తో సిరీస్ సమయంలో కూడా పాజిటివ్‌గా తేలాడు. రెండు సార్లు కరోనా బారిన పడిన రుతురాజ్ గైక్వాడ్, ఇలా జాగ్రత్తలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదంటున్నారు...

89

మ్యాచ్ ఆరంభానికి ముందు భారత క్రికెటర్లు ఫోన్లకు దగ్గరకు ఉండడానికి అనుమతి లేదు. అలాగే గ్రౌండ్‌మెన్‌కి, క్రికెటర్ల డగౌట్‌లోకి వచ్చేందుకు కానీ, కూర్చొవడానికి కానీ అనుమతి లేదు. అందుకే రుతురాజ్ గైక్వాడ్, గ్రౌండ్‌మెన్‌ని అలా వెళ్లిపొమ్మని చెప్పి ఉంటాడని అంటున్నారు మరికొందరు నెటిజన్లు...

99
Ruturaj Gaikwad

కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడంతో ఇషాన్ కిషన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్. మూడో టీ20లో 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి టీ20 కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్, వర్షం కారణంగా రద్దయిన ఐదో టీ20లో 12 బంతుల్లో ఓ ఫోర్‌తో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గైక్వాడ్ అవుటైన తర్వాత ఒక్క బంతికే వర్షం రీఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ రద్దయ్యింది. 

click me!

Recommended Stories