8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. ద్రావిడ్ కు విసుగు తెప్పిస్తోందా..? కీలక వ్యాఖ్యలు చేసిన హెడ్ కోచ్

Published : Jun 20, 2022, 11:13 AM IST

Rahul Dravid: విరాట్ కోహ్లి భారత సారథిగా వెనుదిరిగిన తర్వాత అతడి తర్వాత గడిచిన 8 నెలల్లో టీమిండియాకు ఆరుగురు నాయకులు పనిచేశారు. మరోవారం రోజుల్లో ఈ సంఖ్య ఏడుకు చేరనుంది.  

PREV
18
8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. ద్రావిడ్ కు విసుగు తెప్పిస్తోందా..? కీలక వ్యాఖ్యలు చేసిన హెడ్ కోచ్

భారత జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా ఉన్న మహేంద్ర సింగ్ ధోని తర్వాత  ఆ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లి.. తన బాధ్యతలను వంద శాతం నిబద్ధతతో నిర్వర్తించాడు. అయితే గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ లో కెప్టెన్సీ కోల్పోయాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా టీమిండియాకు ఏకంగా ఆరుగురు కెప్టెన్లు పనిచేశారు. 

28

టీ20 ప్రపంచకప్ అనంతరం.. టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్ గా ఎంపికయ్యాడు. అదే సమయంలో  రోహిత్ శర్మ కూడా భారత జట్టు సారథిగా నియమితుడయ్యాడు. ఈ 8 నెలల కాలంలో ద్రావిడ్.. ఆరుగురు కెప్టెన్లను చూశాడు. ఈ నేపథ్యంలో ద్రావిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

38

దక్షిణాఫ్రికాతో  బెంగళూరులో జరిగిన ఐదో మ్యాచ్ వర్షార్పణ అయిన అనంతరం  ద్రావిడ్ మాట్లాడుతూ.. ‘ఇది (కోచింగ్) చాలా సరదాగా, ఎగ్జైటింగ్ గా ఉంది.  అదే సమయంలో చాలా సవాలుతో కూడుకున్నది. గడిచిన 8 నెలల్లో నేను ఆరుగురు కెప్టెన్లతో పనిచేయాల్సి వచ్చింది. వాస్తవానికి నేను టీమిండియా హెడ్ కోచ్ గా ప్రారంభించినప్పుడు  ఇది నా ప్రణాళిక కాదు. 

48

కానీ మేము ఆడుతున్న క్రికెట్, కరోనా, గాయాల కారణంగా పలువురు కొత్త కెప్టెన్లతో పనిచేయాల్సి వస్తుంది. ఇది కొత్తగా ఉంది. అయితే ఇలా జరగడం వల్ల పలువురు యువ ఆటగాళ్లకు నాయకత్వం వహించే అవకాశం కూడా లభించింది.  

58

అంతేగాక భవిష్యత్తు నాయకులను తయారు చేసే అవకాశాలు కూడా మాకు లభించాయి...’అని ద్రావిడ్ అన్నాడు. 2021 జులై-ఆగస్టులలో ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు వెళ్లగా.. ధావన్ నేతృత్వంలోని రెండో భారత జట్టు శ్రీలంకలో  పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడిన విషయం తెలిసిందే. 

68

ఇక కోహ్లి నిష్క్రమణ అనంతరం రోహిత్ శర్మ భారత క్రికెట్ జట్టుకు సారథి కాగా ఈ ఏడాది ప్రారంభంలో నిర్వహించిన దక్షిణాఫ్రికా సిరీస్ కు అతడు గాయం కారణంగా వెళ్లలేదు. దీంతో కెఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు.  

78

ఇక తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్ లో  రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. కెఎల్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించారు.  కానీ సిరీస్ కు మరో రెండు రోజుల ముందు అతడు గాయంతో వైదొలడగంతో రాహుల్ స్థానంలో రిషభ్ పంత్ కు జట్టును లీడ్ చేసే అవకాశాలు లభించాయి. ఇక ఐర్లాండ్ టూర్ కు వెళ్లబోయే టీమిండియాకు హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. 

88

ఇక ఈ సిరీస్ లో పంత్ సరిగా రాణించలేకపోవడంపై ద్రావిడ్ స్పందించాడు. రిషభ్ ను ద్రావిడ్ వెనకేసుకొచ్చాడు. ‘సఫారీలతో సిరీస్‌లో పంత్‌ ఇంకొన్ని పరుగులు చేయాల్సింది. కానీ అతడు మా ప్రణాళికల్లో భాగమైన ప్రధాన ఆటగాడు. రెండు, మూడు మ్యాచ్‌ల ఆధారంగా ఆటగాళ్లపై ఒక అంచనాకు రాకూడదు. మధ్య ఓవర్లలో ధాటిగా ఆడే క్రమంలో కొన్నిసార్లు తప్పుడు షాట్లకు అతడు వికెట్‌ సమర్పించుకున్నాడు. అయితే సిరీస్ లో 2-0తో వెనుకబడ్డ తిరిగి పుంజుకోవడం  ఆనందంగా ఉంది’ అని ద్రావిడ్ అన్నాడు. 
 

click me!

Recommended Stories