మాంచెస్టర్‌లో జరుగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో జో రూట్ తన 38వ టెస్టు సెంచరీ సాధించి చరిత్రను తిరగరాశాడు. భారత్‌పై ఆతిథ్య జట్టు ఆధిపత్యం కొనసాగించిన మూడో రోజు, రూట్ తన అత్యుత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు.
120 పరుగులు పూర్తి చేసిన క్రమంలో జో రూట్.. రికీ పాంటింగ్ టెస్టు పరుగుల రికార్డును అధిగమించాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. టాప్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
25
హోం టెస్ట్ సెంచరీల పరంగా సచిన్‌ను అధిగమించిన జో రూట్
ఈ సెంచరీ రూట్‌కు ఇంగ్లాండ్ గడ్డపై 23వ టెస్టు సెంచరీ కావడం విశేషం. దీంతో టెస్టు చరిత్రలో అత్యధిక హోం సెంచరీల పరంగా సచిన్ టెండూల్కర్ (22 సెంచరీలు), కుమార్ సంగక్కరలను జోరూట్ అధిగమించాడు. ప్రస్తుతం జో రూట్ 23 హోం సెంచరీలతో మాహేళ జయవర్ధనె, జాక్ కాలిస్, రికీ పాంటింగ్‌తో సమానంగా ఉన్నాడు.
అత్యధిక హోం టెస్ట్ సెంచరీలు కొట్టిన టాప్ 5 ప్లేయర్లు
జో రూట్ – 23 (84 మ్యాచులు)
మాహేళ జయవర్ధనె – 23 (81)
జాక్ కాలిస్ – 23 (88)
రికీ పాంటింగ్ – 23 (92)
సచిన్ టెండూల్కర్ – 22 (94)
35
జోరూట్ ఖాతాలో భారత్‌పై అత్యధిక సెంచరీల రికార్డు
జో రూట్ తన 12వ టెస్టు సెంచరీతో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా చోటు సంపాదించాడు. అలాగే, స్టీవ్ స్మిత్ 11 సెంచరీల రికార్డును అధిగమించాడు.
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక టెస్టు సెంచరీలు
డాన్ బ్రాడ్‌మన్ – 19 (vs ఇంగ్లాండ్)
సునీల్ గవాస్కర్ – 13 (vs వెస్టిండీస్)
జాక్ హాబ్స్ – 12 (vs ఆస్ట్రేలియా)
స్టీవ్ స్మిత్ – 12 (vs ఇంగ్లాండ్)
జో రూట్ – 12 (vs ఇండియా)
డాన్ బ్రాడ్‌మన్ హోం గ్రౌండ్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీల రికార్డును కూడా రూట్ అధిగమించాడు. బ్రాడ్‌మన్ ఇంగ్లాండ్‌పై 8 హోం సెంచరీలు చేయగా, రూట్ భారత్‌పై 9 హోం సెంచరీలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌కు ముందు జో రూట్ 13,259 పరుగులతో టెస్టు అత్యధిక పరుగుల లిస్టులో మూడవ స్థానంలో ఉన్నాడు. మూడవ రోజున ఆరంభ గంటలోనే 31 పరుగులు చేయడంతో రాహుల్ ద్రావిడ్ (13,288 పరుగులు), జాక్ కాలిస్ (13,289) రికార్డులను అధిగమించాడు.
జో రూట్ ప్రస్తుతం 13,379 పరుగులతో రికీ పాంటింగ్‌ను కూడా వెనక్కి నెట్టాడు. సచిన్ టెండూల్కర్ (15,921) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.