విజ్డెన్ లీడింగ్ క్రికెటర్స్ ఇన్ వరల్డ్ గా జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన

Wisden's Leading Cricketers in the World: భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, భారత స్టార్ మహిళా క్రికెట్ స్మృతి మంధానలకు విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డులు లభించాయి. గతంలో భారత్ నుంచి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని భారత దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీలు అందుకున్నారు.

Jasprit Bumrah, Smriti Mandhana named Wisden's Leading Cricketers in the World in telugu rma
Jasprit Bumrah, Smriti Mandhana named Wisden's Leading Cricketers in the World

Wisden's Leading Cricketers in the World: ప్రపంచంలోని గొప్ప బౌలర్లలో ఒకరిగా మూడు ఫార్మాట్లలో సత్తా చాటుతున్న భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, టీమిండియా హహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానలకు విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ అవార్డులు లభించాయి. 2025 విస్‌డెన్ లీడింగ్ క్రికెటర్స్ అల్మనాక్ ప్రపంచంలోని ప్రముఖ ప్లేయర్లుగా వీరిని ప్రకటించింది.
 

Jasprit Bumrah, Smriti Mandhana named Wisden's Leading Cricketers in the World in telugu rma
Jasprit Bumrah. (Photo- ICC)

2024లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో సగటు 20 కన్నా తక్కువగా 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా గుర్తింపు పొందాడు. మొత్తం 71 టెస్టు వికెట్లు తో పాటు మొత్తంగా 86 వికెట్లు తీసుకున్నాడు. 

జూన్‌లో కరేబియన్ దీవుల్లో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. విజ్డెన్ సంపాదకుడు లారెన్స్ బూత్ బుమ్రాను "ఈ ఏడాది నిజమైన స్టార్" అని అభివర్ణించారు. ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా 32 వికెట్లు తీసుకున్నాడు.
 


ప్రపంచపు ప్రముఖ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన 

భరత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన 2024లో 1659 పరుగులు చేసి ప్రపంచంలో ఒక ఏడాది అత్యధిక పరుగులు చేసిన రికార్డును సాధించింది. ఇందులో 4 వన్డే సెంచరీలు కూడా ఉన్నాయి. జూన్‌లో దక్షిణాఫ్రికా పై టెస్టులో 149 పరుగులతో భారత కు విజయాలు అందించింది. 

Nicholas Pooran (Photo- IPL)

ప్రపంచపు ప్రముఖ టీ20 క్రికెటర్‌గా నికొలాస్ పూరన్ 

వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికొలాస్ పూరన్ ప్రపంచపు అత్యుత్తమ టీ20 క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 21 టీ20ల్లో అతను 464 పరుగులు సాధించాడు. భారత్ నుంచి బుమ్రా, మంధానలతో పాటు గతంలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని భారత దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, విరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీలు అందుకున్నారు.

Latest Videos

vuukle one pixel image
click me!