KL Rahul
Fastest to 5000 runs in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా 40వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ అందుకుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది.
KL Rahul IPL records
బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఢిల్లీ ఆధిపత్యం చూపింది. 160 పరుగుల లక్ష్యాన్ని కేవలం 17.5 ఓవర్లలోనే ఛేదించి, లక్నోను షాక్‌కు గురిచేసింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కేఎల్ రాహుల్, తనను అవమానించిన మాజీ జట్టుపై అద్భుత ప్రదర్శనతో ప్రతీకారం తీర్చుకున్నాడు.
తనను తక్కువగా చూసిన ఫ్రాంఛైజీకి, అదే గ్రౌండ్‌లో బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో మరో అద్భుతమైన రికార్డును సాధించాడు.
Fastest to 5000 runs in IPL KL Rahul
లక్నో తో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ తన 57 పరుగులు ఇన్నింగ్స్ తో ఐపీఎల్ లో 5000 పరుగుల మార్కును చేరుకున్నాడు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు. కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని చేరుకున్నాడు, ఆస్ట్రేలియన్ స్టార్ డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. వార్నర్ 135 ఇన్నింగ్స్‌లలో 5000 పరుగుల మార్కును చేరుకున్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన ఆటగాళ్లు :
1 - కేఎల్ రాహుల్: 130 ఇన్నింగ్స్‌లు
2 - డేవిడ్ వార్నర్: 135 ఇన్నింగ్స్‌లు
3 - విరాట్ కోహ్లీ : 157 ఇన్నింగ్స్‌లు
4 - ఏబీ డివిలియర్స్: 161 ఇన్నింగ్స్
5 - శిఖర్ ధావన్ : 168 ఇన్నింగ్స్
KL Rahul (Photo- IPL)
కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025 సీజన్‌లో తన మూడవ అర్ధ సెంచరీని సాధించాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ కెరీర్ గమనిస్తే 139 మ్యాచ్ లలో 130 ఇన్నింగ్స్ లను ఆడి 5006 పరుగులు చేశాడు. 46.35 సగటు, 135.71 స్ట్రైక్ రేటుతో అతని బ్యాటింగ్ కొనసాగింది. ఇందులో 4 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 425 ఫోర్లు, 203 సిక్సర్లు బాదాడు.
ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 132 పరుగులు. ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. 2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ లో చేరాడు. మళ్లీ 2016లో ఆర్సీబీలోకి వచ్చాడు. గాయం కారణంగా 2017 సీజన్ ను మిస్సయ్యాడు. 2018లో పంజాబ్ టీమ్ లోకి వెళ్లాడు. 2022లో లక్నో టీమ్ కెప్టెన్ గా వరుసగా రెండు సీజన్లలో జట్టును ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లాడు. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు.