Pant and Zaheer dugout argument
Pant and Zaheer dugout argument after LSG loss: ఐపీఎల్ 18వ సీజన్ లో ఏప్రిల్ 22న ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. లక్నో ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి కారణం ఎవరు? పంత్ ఆలస్యంగా బ్యాటింగ్ కి రావడమా? లేక LSG వ్యూహంలో లోపమా? కెప్టెన్, మెంటార్ మధ్య వాగ్వాదం ఎందుకొచ్చింది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Pant and Zaheer dugout argument after LSG loss
IPL 2025 పంత్ బ్యాటింగ్ వివాదం
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది. 12వ ఓవర్లో నికోలస్ పూరన్ ఔటయ్యాక, LSG స్కోరు 2 వికెట్లకు 99 పరుగులు. అందరూ పంత్ బ్యాటింగ్ కి వస్తాడని భావించారు. కానీ అబ్దుల్ సమద్, ఆ తర్వాత డేవిడ్ మిల్లర్, ఆయూష్ బడోనీలు వచ్చి త్వరగా ఔటయ్యారు.
రిషబ్ పంత్ 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. కేవలం 2 బంతులు మిగిలి ఉండగా బ్యాటింగ్ కి వచ్చాడు. రివర్స్ ల్యాప్ ఆడబోయి ఔటయ్యాడు. దీంతో LSG 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది.
18th over and he's acting like he'll come noww... 😭😭 he should've tried acting rather than playing cricket. 🥰🥰#RishabhPant #IPL2025 #LSGvsDC #DCvLSG pic.twitter.com/CWtcYYOrVG
— Shruti (@Shruti3256911) April 22, 2025
Pant and Zaheer dugout argument after LSG loss:
కోపంగా కనిపించిన రిషబ్ పంత్
ఔటయ్యాక పంత్ కోపంగా పెవిలియన్ కి వెళ్ళాడు. డగౌట్ లో జహీర్ ఖాన్ తో మాట్లాడుతూ కనిపించాడు. పంత్ బ్యాటింగ్ గురించే చర్చ జరిగిందని, తనని ముందుగా బ్యాటింగ్ కి పంపమని చెప్పానని పంత్ అంటున్నాడని సురేష్ రైనా కామెంట్రీలో అన్నాడు. సోషల్ మీడియాలో కూడా లక్నో టీమ్ లో ఏం జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు.
రిషబ్ పంత్ పై విమర్శలు చేసేవారున్నారు. అలాగే, లక్నో టీమ్ పై కూడా విమర్శలు చేస్తున్నవారు ఉన్నారు. మొత్తంగా జహీర్, పంత్ లు మ్యాచ్ వ్యూహాం గురించే వాగ్వాదం చేసుకున్నారని సమాచారం. పంత్ ను త్వరగా బ్యాటింగ్ కు పంపకుండా నిర్ణయం తీసుకోడం కూడా అతనికి కోసం తెప్పించి ఉంటుందని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
Pant and Zaheer dugout argument after LSG loss
ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం అందించారు. ఐడెన్ మార్క్రమ్ 52, మిచెల్ మార్ష్ 45 పరుగులు ఇన్నింగ్స్ లను ఆడారు. కానీ, ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు ఎవరూ పెద్దగా పరుగులు చేయలేదు. చివరలో ఆయూష్ బదోని 36 పరుగులు చేశారు.
దీంతో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. స్వల్ప టార్గెట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఈజీగానే అందుకుంది. ఢిల్లీ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ పోరెల్ 51 పరుగులు, కేఎల్ రాహుల్ 57 పరుగులు, అక్షర్ పటేల్ 34 పరుగులతో ఢిల్లీకి విజయాన్ని అందించారు.