బుమ్రా మాయజాలం.. అశ్విన్ పటాస్.. గిల్-జైస్వాల్ తుఫాను !

First Published | Feb 6, 2024, 12:12 AM IST

India vs England:వైజాగ్ టెస్టు మ్యాచ్ లో జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మాయ‌జాలం ప‌నిచేసింది. ర‌విచంద్ర‌న్ అశ్విన్ స్పిన్ ప‌టాస్ పేలింది. శుభ్ మ‌న్ గిల్-య‌శ‌స్వి జైస్వాల్ తుఫానులో ఇంగ్లాండ్ కొట్ట‌కుపోయింది.. ! 

Jasprit Bumrah, Yashasvi Jaiswal,

Team India: జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ల అద్భుత బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌, య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్ తుఫాను బ్యాటింగ్ తో విశాఖ‌లో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భార‌త్ విక్ట‌రీ సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టులో నాలుగో రోజైన సోమవారం ఇంగ్లండ్‌ను 106 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బౌల‌ర్లు రాణించ‌డంతో 399 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 292 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో భారత్ 5 టెస్టుల సిరీస్ ను 1-1తో సమం చేసింది.

india, cricket

విశాఖ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జాక్ క్రాలీ ఒక్క‌డే రెండు ఇన్నింగ్స్ ల‌లో హాఫ్ సెంచ‌రీల‌తో రాణించాడు. భారత్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు మొత్తం ఈ టెస్టులో 9 వికెట్లు తీసుకున్న జ‌స్ప్రీత్ బుమ్రాకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్' ల‌భించింది.  రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ 72 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే, ఒక్క వికెట్ దూరంలో టెస్టుల్లో 500 వికెట్ల ఫీట్‌ను దూరంగా ఆగిపోయాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 67 పరుగులతో నాల్గో రోజు ఆట ప్రారంభించ‌గా, తొలి సెషన్‌లో 127 పరుగులు చేసింది కానీ,  వికెట్లు తీసి భార‌త్ మ్యాచ్ పై ఆధిపత్యం సాధించింది. 

Latest Videos


India win vs England

లంచ్ బ్రేక్ కు ముందు జాక్ క్రాలీ (73)ని కుల్దీప్ అవుట్ చేయగా, బుమ్రా జానీ బెయిర్‌స్టో (26)ను పెవిలియ‌న్ కు పంపి ఇంగ్లాండ్ ప‌త‌నాన్ని శాసించారు. ఈ సమయానికి ఇంగ్లండ్ స్కోరు ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. లంచ్ తర్వాత శ్రేయాస్ అయ్యర్ వేసిన కచ్చితమైన త్రోలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (11) రనౌట్ కావడంతో ఇంగ్లండ్ ఆశలకు తెరపడింది. కానీ, చివ‌ర‌లో బెన్ ఫాక్స్ (36), టామ్ హార్ట్లీ (36) ఎనిమిదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం మ‌ళ్లీ ఇంగ్లాండ్ ఆశ‌లు చిగురించాయి. అయితే, బ్రేక్ టైమ్ త‌ర్వాత ఈ జోడిని విడ‌దీయ‌డంతో భార‌త్ గెలుపు లాంఛనంగా ముగిసింది.

జాక్ క్రాలీ నిల‌క‌డైన ఆట‌తో రెండు ఇన్నింగ్స్ లో మంచి ప‌రుగులు సాధించాడు. జాక్ రెండో ఇన్నింగ్స్ లో 73 ప‌రుగులు చేశాడు. జో రూట్ (16), ఆలీ పోప్ (23) దూకుడుగా ఆట‌ను కొన‌సాగించ‌డంలో వికెట్ల ముందు దొరికిపోయారు. జాక్ క్రాలీ వ్యతిరేకంగా కుల్దీప్ వేసిన బంతికి ఆన్-ఫీల్డ్ అంపైర్ ఎల్బీడ‌బ్యూ అప్పీల్‌ను తిరస్కరించాడు, అయితే కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్‌ఎస్ తీసుకోవాలనే నిర్ణయం విజయవంతమైంది.

ఈ మ్యాచ్ లో త‌న బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను చెడుగుడు ఆడుకున్న జ‌స్ప్రీత్ బుమ్రా రెండు గంటల ప్రారంభ సెషన్‌లో భీకరంగా బాల్ తో దాడి చేశాడు. జో రూట్ ను ఔట్ చేసి ర‌వి చంద్ర‌న్ అశ్విన్ టెస్టుల్లో  499వ వికెట్ తీసుకున్నాడు. 500 వికెట్ల క్ల‌బ్ లో చేర‌డానికి ఒక్క వికెట్ దూరంలో నిలిచిపోయాడు.

click me!