తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ! అట్లుంట‌ది మ‌న‌తోని మ‌రి.. !

First Published Feb 5, 2024, 3:56 PM IST

India vs England: హైద‌రాబాద్ లో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓటమికి భారత్ విశాఖపట్నంలో ప్ర‌తీకారం తీర్చుకుంది. వైజాగ్ లో ఇంగ్లాండ్ ను 106 పరుగుల తేడాతో చిత్తుచేసింది. బ్యాటింగ్ లో య‌శ‌స్వి జైస్వాల్, శుభ్ మ‌న్ గిల్, బౌలింగ్ లో జ‌స్ప్రీత్ బుమ్రా, ఆశ్విన్, కుల్దీప్ యాద‌వ్ లు భార‌త విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 
 

India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ లోని తొలి టెస్టు మ్యాచ్‌లో తడబడిన భారత్.. విశాఖ‌లో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై ఘ‌న విజ‌యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఇచ్చిన 399 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భార‌త బౌల‌ర్లు విజృంభ‌ణ‌తో 292 పరుగులకు ఆలౌటైంది.

హైద‌రాబాద్ లో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్ ఓటమికి భారత్ విశాఖపట్నంలో ప్ర‌తీకారం తీర్చుకుంది. వైజాగ్ లో ఇంగ్లాండ్ ను 106 పరుగుల తేడాతో చిత్తుచేసింది. 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-1తో సమం చేసింది. 

Latest Videos


చివరి రోజు ఆటలో 9 వికెట్లతో రెండో ఇన్నింగ్స్ ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ను భార‌త బౌల‌ర్లు జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్ లు దెబ్బ‌కొట్టారు. అద్భుత‌మైన బౌలింగ్ ధాటికి ఇంగ్లాండ్ తడబడింది. జాక్ క్రాలీ ఒక్క‌డే భార‌త బౌలింగ్ ను ఎదుర్కొని 73 ప‌రుగుల‌తో ఇంగ్లాండ్ జ‌ట్టు త‌ర‌ఫున‌ టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇత‌ర స్టార్ ప్లేయ‌ర్లు త‌క్కువ స్కోర్ల‌కే ఔట్ అయ్యారు. 

దాదాపు భార‌త్ గెలుపు ఖాయ‌మ‌ని అనుకుంటున్న త‌రుణంలో చివరలో బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ కోలుకుని భార‌త్ కు స‌వాలు విసిరింది. కానీ, టీమిండియా బౌలింగ్ ధాటికి చివ‌ర‌కు ఇంగ్లాండ్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. 

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది. 2వ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ చేసిన సెంచ‌రీ (104) పోరాటం భారత్‌కు అండగా నిలిచింది. శుభ్‌మన్ గిల్-అక్షర్ పటేల్ (45) 89 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. రెచ్చిపోయిన గిల్ తన 3వ టెస్టు సెంచరీని పూర్తి చేశాడు.

భార‌త బౌల‌ర్లు ఇంగ్లాండ్ ప‌త‌నాన్ని శాసించారు. రెండో ఇన్నింగ్స్ లో స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 3 వికెట్లు తీసుకున్నాడు. ముఖేష్ కుమార్, అక్ష‌ర్ ప‌టేల్, కుల్దీప్ యాద‌వ్ లు త‌లా ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు. 

భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ (209 ప‌రుగులు) చేడంతో తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో జ‌స్ప్రీత్ బుమ్రా పేస్ బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ బ్యాట‌ర్లు ఎక్కువ సేపు క్రీజులో నిల‌బ‌డ‌లేక‌పోయారు. దీంతో భార‌త్ మంచి అధిక్యం ల‌భించింది. 

Bumrah-Ashwin

భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో అద్భుత‌మైన బౌలింగ్ తో రాణించి టీమిండియాకు విజ‌యాన్ని అందించిన జస్ప్రీత్ బుమ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. రెండో టెస్టులో బుమ్రా 9 వికెట్లు తీసుకున్నాడు.

click me!