Sachin Tendulkar
Sachin Tendulkar-Kashmir bat factory: జమ్మూకాశ్మీర్ కు చెందిన ఒక బ్యాట్ లను తయారు చేసే ఫ్యాక్టరీ క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ హృదయాన్ని కొల్లగొట్టింది. ఆ ఫ్యాక్టరీని చూడటానికి సచిన్ టెండూల్కర్ తన ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్లారు.
Sachin Tendulkar
జమ్మూకాశ్మీర్‌లోని సంగమ్ ప్రాంతంలో క్రికెట్ బ్యాట్ తయారీదారుడు.. తన బ్యాట్ తయారీ ఫ్యాక్టరీ యూనిట్ ను సచిన్ టెండూల్కర్, అతని కుటుంబ సభ్యులు చూడ్డానికి వచ్చినప్పుడు అతనితో పాటు అక్కడున్న చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యాడు.
Sachin Tendulkar
సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి శ్రీనగర్-జమ్మూ హైవేపై చార్సూలోని ఒక యూనిట్ వద్ద ఆగి, అక్కడి కార్మికులతో సంభాషించారు.
Sachin Tendulkar
దీని గురించి ఫ్యాక్టరి,ఎంజే స్పోర్ట్స్ యజమాని మహ్మద్ షాహీన్ పర్రే వివరిస్తూ.. "మా గేట్ వద్ద వాహనం ఆగినప్పుడు మేము బ్యాట్ల తయారీలో బిజీగా ఉన్నాము. ఆ కారులో లిటిల్ మాస్టర్, అతని కుటుంబాన్ని చూసి మేము ఆశ్చర్యపోయాము" అని తెలిపినట్టు పీటీఐ పేర్కొంది.
Sachin Tendulkar
కాశ్మీర్ కర్రలతో తయారు చేసిన బ్యాట్‌ల నాణ్యతను టెండూల్కర్ తనిఖీ చేశారని పర్రే చెప్పారు."అతను కొన్ని బ్యాట్‌లను చూశారు. నాణ్యతతో చాలా సంతోషించాడు. కాశ్మీర్ విల్లో బ్యాట్‌లను ఇంగ్లీష్ విల్లోతో తయారు చేసిన వాటితో పోల్చడానికి తాను వచ్చానని టెండూల్కర్ చెప్పారని పేర్కొన్నారు.
Sachin Tendulkar
సచిన్ వచ్చారనే వార్త తెలియడంతో క్రికెట్ లవర్స్ అక్కడి చాలా మంది చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్ చాలా సమయం అక్కడ గడిపారు. స్థానికంగా తమ బ్యాట్లకు మద్దతును అందించాలని సచిన్ ను కోరినట్టు పర్రే చెప్పారు.
Sachin Tendulkar
సచిన్ టెండూల్కర్ బ్యాట్ల తయారీ యూనిట్‌లో ఒక గంటకు పైగా సమయం గడిపారు. అలాగే, అక్కడకు వచ్చిన అభిమానులు, క్రికెట్ లవర్స్ తోనూ మాట్లాడారు.