Published : Feb 18, 2024, 10:43 PM ISTUpdated : Feb 18, 2024, 10:46 PM IST
India vs England : ఇంగ్లాండ్ తో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో కూడా జైస్వాల్ డబుల్ సెంచరీ కొట్టాడు.
IND vs ENG - Yashasvi Jaiswal : రాజ్‌కోట్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ప్లేయర్లు బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేశారు.
26
Yashasvi Jaiswal
టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో మరో డబుల్ సెంచరీ కొట్టాడు. భారత్ కు భారీ అధిక్యం లభించేలా కృషి చేశాడు. ఇంగ్లాండ్‌కు బౌలర్లు జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జో రూట్, రెహాన్ అహ్మద్ ల బౌలింగ్ ను ఉతికిపారేశాడు.
36
ఈ సిరీస్ లో వరుస డబుల్ సెంచరీలతో ఇంగ్లాండ్ కు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. టెస్టు క్రికెట్‌లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించిన జైస్వాల్ మరో రికార్డును క్రియేట్ చేశాడు.
46
Yashasvi Jaiswal
రాజ్‌కోట్ మైదానంలో డబుల్ సెంచరీ సాధించిన యశస్వి జైస్వాల్, అంతకుముందు విశాఖపట్నంలో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
56
Yashasvi Jaiswal
జైస్వాల్ విశాఖపట్నంలో 290 బంతుల్లో 209 పరుగులతో డబుల్ సెంచరీ కొట్టాడు. రాజ్ కోట్ లో జరిగిన మూడో టెస్టులో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 236 బంతుల్లో 214 పరుగులతో అజేయంగా నిలిచాడు.
66
Yashasvi Jaiswal-Shubman Gill
తన మొదటి 3 టెస్టు సెంచరీలను 150+ స్కోర్లుగా మార్చిన తొలి భారత క్రికెటర్ గా యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. యశస్వి జైస్వాల్ వెస్టిండీస్‌పై 171, విశాఖలో ఇంగ్లాండ్ పై 209 , రాజ్ కోట్ మళ్లీ ఇంగ్లాండ్ పై 214* పరుగులు సాధించాడు.