IPL 2025: Sunrisers Hyderabad vs Gujarat Titans
IPL SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో 19వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టీమ్ హైదరాబ్ జట్టును ఓడించింది.
హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 152/8 పరుగులు చేయగా, గుజరాత్ 16.4 ఓవర్లలో 153/3 పరుగులతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2025: Sunrisers Hyderabad vs Gujarat Titans
1. హైదరాబాద్ టీమ్ చెత్త బ్యాటింగ్
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ భారీ రికార్డు స్కోర్ కొడుతుందని అందరూ భావించారు. కానీ, అలాంటి మెరుపులు కనిపించలేదు. అద్భుతమైన నాక్ లు రాలేదు. గెలుపుకోసం పోరాడటానికి కావాల్సిన సాధారణ స్కోర్ ను కూడా చేయలేకపోయింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 152/8 పరుగులు మాత్రమే చేయగలిగింది.
బిగ్ హిట్టర్లు అభిషేక్ శర్మ (18), ట్రావిస్ హెడ్ (8), ఇషాన్ కిషన్ (17) పెద్ద ఇన్నింగ్స్ లను ఆడలేకపోయారు. వీరి తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి 31 పరుగులు చేసిన దాని కోసం 34 బంతులు ఆడాడు. హైన్రిక్ క్లాసెన్ 27 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. చివరలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 9 బంతుల్లో 22* పరుగులు చేయడంతో హైదరాబాద్ స్కోర్ 150+ దాటింది.
2. గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బౌలింగ్
ఈ మ్యాచ్ గెలవడంలో గుజరాత్ బౌలర్లదే ప్రధాన పాత్ర అని చెప్పాలి. హైదరాబాద్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే అద్భుతమైన బౌలింగ్ తో వారిని ఇబ్బంది పెట్టారు. మరీ ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ కీలకమైన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలను అవుట్ చేయడంతో హైదరాబాద్ టీమ్ బిగ్ స్కోర్ చేయడంలో విఫలమైంది.
మొత్తంగా సిరాజ్ తన 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 4 వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అలాగే, మిడిల్ ఓవర్లలో యంగ్ ప్లేయర్ సాయి కిషోర్ కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. నితీష్ కుమార్ రెడ్డి, హైన్రిక్ క్లాసెన్ లను పెవిలియన్ కు పంపాడు. ప్రసిధ్ కృష్ణ కూడా ఇషాన్ కిషన్, కమిందు మెండిస్‌ను అవుట్ చేసి గుజరాత్ చేతిలో మ్యాచ్ వుండేలా చేశాడు.
Gill
3. ఆడుతూ పాడుతూ రన్ ఛేజ్ చేసిన గుజరాత్ టైటాన్స్
స్లోగా ఉన్న పిచ్ లో మొదట బౌలింగ్ లో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ఆ తర్వాత బ్యాటింట్ లో కూడా తన సత్తా చాటింది. మంచి ఫామ్ లో ఉన్న సాయి సుదర్శన్, జోస్ బట్లర్ వికెట్లు త్వరగానే కోల్పోయినప్పటికీ శుభ్ మన్ గిల్ (43 బంతుల్లో 61 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49 పరుగులు), షెర్ఫేన్ రథ్‌ఫర్డ్ (16 బంతుల్లో 35 పరుగులు) లు మంచి ఇన్నింగ్స్ లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించారు.
4. మొదట బ్యాటింగ్ లో ఫెయిల్, ఆ తర్వాత బౌలింగ్ లో కూడా చేతులెత్తేసిన SRH
ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో రాణించలేపోయిన హైదరాబాద్ టీమ్ బౌలింగ్ లో కూడా ప్రభావం చూపించలేకపోయింది. మహమ్మద్ షమీ (2/28), ప్యాట్ కమ్మిన్స్ (1/14) ప్రారంభంలో వికెట్లు తీసినా ఆ తర్వాత ప్రభావం చూపించలేదు.