IPL SRH vs GT: గుజరాత్ హ్యాట్రిక్ గెలుపు.. తీరు మార్చుకోని సన్‌రైజర్స్ హైదరాబాద్
IPL SRH vs GT: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వ ఓటమిని ఎదుర్కొంది. గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ఆటతో హైదరాబాద్ టీమ్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
IPL SRH vs GT: ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వ ఓటమిని ఎదుర్కొంది. గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ఆటతో హైదరాబాద్ టీమ్ ను 7 వికెట్ల తేడాతో ఓడించింది.
IPL SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో 19వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ హైదరాబాద్ టీమ్ ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 152/8 పరుగులు చేసింది. గుజరాత్ టీమ్ 16.4 ఓవర్లలో 153/3 పరుగులతో టార్గెట్ ను అందుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ మైదరాబాద్ మొదట బ్యాటింగ్ కు దిగింది. హోం గ్రౌండ్ లో ఆడుతున్న మ్యాచ్ కావడంతో బిగ్ హిట్టర్లు ఉండటంతో వారి నుంచి సునామీ ఇన్నింగ్స్ లతో భారీ స్కోర్ వస్తుందని అందరూ భావించారు. కానీ, అలాంటిదేమీ కనిపించలేదు. హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల సునామీ రాలేదు. కానీ, హైదరాబాబ్ ప్లేయర్, గుజరాత్ తరఫున ఆడుతున్న మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో సన్ రైజర్స్ ను దెబ్బకొట్టాడు.
ఇద్దరు హైదరాబాద్ ఓపెనర్లను సిరాజ్ మియా అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ 18 పరుగులు, ట్రావిస్ హెడ్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లలో ఎవరు కూడా పెద్ద ఇన్నింగ్స్ ను ఆడలేకపోయారు. ఇషాన్ కిషన్ 17, నితీష్ కుమార్ రెడ్డి 31, హెన్రిచ్ క్లాసెన్ 27, చివరలో ప్యాట్ కమ్మిన్స్ 22 పరుగులు చేయడంలో 20 ఓవర్లలో హైదరాబాద్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.
లోకల్ బాయ్ సిరాజ్ మియా అద్భుతమైన బౌలింగ్ తో తన 4 ఓవర్ల బౌలింగ్ లో కేవలం 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే, ప్రసిద్ధ్ 2, సాయి కిషోర్ 2 వికెట్లు తీసుకున్నారు.
ఈజీ టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన గుజరాత్ టైటాన్స్ మూడో ఓవర్ లో సాయి సుదర్శన్ రూపంలో బిగ్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వెంటనే జోస్ బట్లర్ వికెట్ ను కోల్పోయింది. కానీ, ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకుని శుభ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, చివరలో రూథర్ ఫర్డ్ సూపర్ నాక్ తో గుజరాత్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది.
శుభ్ మన్ గిల్ కెప్టెన్సీ నాక్ తో చివరి వరకు క్రీజులో ఉండి టైటాన్స్ కు విజయాన్ని అందించారు. గిల్ 61 పరుగుల తన అజేయ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు బాదాడు. వాషింగ్టన్ సుందర్ 29 బంతులు ఆడి 49 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. రూథర్ ఫర్డ్ 16 బంతుల్లో 35 పరుగులు అజేయ సూపర్ నాక్ ఆడాడు. దీంతో గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 153 పరుగులతో విజయాన్ని అందుకుంది.