SRH vs GT
IPL SRH vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో మరో బిగ్ మ్యాచ్ కు సర్వం సిద్దమైంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ - గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో 19వ మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఐపీఎల్ 2024 ఫైనలిస్టు, ప్యాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాడ్ ప్రస్తుత సీజన్ లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం 1 విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ టీమ్ ఐపీఎల్ 2025లో 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ vs గుజరాత్ టైటాన్స్ హెడ్-టు-హెడ్ రికార్డులు
హైదరాబాద్ (SRH) - గుజరాత్ (GT) లు ఇప్పటివరకు 5 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ 3 విజయాలు సాధించగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ 1 మ్యాచ్ ను గెలుచుకుంది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు.
ఐపీఎల్ 2024లో గుజరాత్-హైదరాబాద్ టీమ్ లు రెండు సార్లు తలపడ్డాయి. ఇందులో ఒక మ్యాచ్ రద్దు కాగా, మరొక మ్యాచ్‌లో టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
IPL 2025
ఐపీఎల్ 2025 SRH vs GT మ్యాచ్ ను గెలిచేది ఎవరు? AI ఏం చెప్పిందో తెలుసా?
IPL 2025 లో ఆదివారం SRH vs GT మ్యాచ్ లో గెలిచేది ఎవరు అని ఏఐని అడిగితే హైదరాబాద్ టీమ్ కు షాక్ తగులుతుందని చెప్పాయి. "ప్రస్తుతం SRH నాలుగు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. GT మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో మెరుగైన మూడో స్థానంలో ఉంది. ఇరు జట్ల ఇటీవలి ఫామ్‌లు, హెడ్-టు-హెడ్ రికార్డులను పరిశీలిస్తే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది" అని ChatGPT చెప్పింది.
ఇక గూగుల్ జెమిని ఎవరైనా గెలవచ్చు అంటూ తనదైన సమాధానమిచ్చింది. "నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ ఏదైనా జరగవచ్చు. హైదరాబాద్ టీమ్ హోమ్ అడ్వాంటేజ్, సునామీ బ్యాటింగ్ లైనప్ వారికి కలిసి రావచ్చు. అయితే, గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్, బౌలింగ్ లో స్థిరమైన ప్రదర్శనలు ఇస్తోంది కాబట్టి ప్రత్యర్థులకు ప్రమాదకరమైన జట్టు. మొత్తంగా ఈ మ్యాచ్ మరో బిగ్ స్కోరింగ్ మ్యాచ్ కావచ్చు" అని Google Gemini అంచనా వేసింది.
SRH విజయాన్ని గ్రోక్ అంచనా వేస్తూ.. "SRH ఒక మెస్.. వారు 4 మ్యాచ్ లలో 1 మాత్రమే గెలిచారు. బలం బ్యాటింగ్ లైనప్.. కానీ వారి బౌలింగ్ ఒక జోక్. కమ్మిన్స్, షమీ ఉడుకురక్తాన్ని ఆపలేరు. అలాగే, జీటీ స్పిన్నర్లకు వారి దగ్గర సమాధానం లేదని" చెప్పింది.
SRH vs GT: ఫాంటసీ జట్టు
బ్యాటర్స్: శుభమాన్ గిల్, ట్రావిస్ హెడ్, సాయి సుదర్శన్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్
ఆల్ రౌండర్లు: రాహుల్ తెవాటియా, పాట్ కమ్మిన్స్, అభిషేక్ శర్మ
బౌలర్లు: రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
వికెట్ కీపర్: హెన్రిచ్ క్లాసెన్
Image Credit: ANI
SRH vs GT: ఎవరు గెలుస్తారు?
ముందుగా బౌలింగ్ చేసే జట్టు మ్యాచ్ గెలుస్తుందని క్రిక్‌ట్రాకర్ అంచనా వేసింది. గూగుల్ మ్యాచ్ ప్రిడిక్షన్ ప్రకారం హైదరాబాద్ గెలిచే అవకాశం 53% ఉంది. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ మరోసారి తమ సునామీ ఇన్నింగ్స్ లు ఆడతారనీ, మరో రెండు పాయింట్లు తమ ఖాతాలో వేసుకోవడానకి సిద్ధంగా ఉన్నారని అంచనా వేసింది.
మొత్తంగా చూస్తే రెండు జట్లు చాలా బలంగా ఉన్నాయి. హైదరాబాద్ టీమ్ కు ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. భారీ స్కోర్ రావడం పక్కా. మరో వైపు గుజరాత్ జట్టు మంచి జోష్ లో ఉంది. వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. కాబట్టి మరో బిగ్ ఫైట్ ఉండనుంది.