Rajasthan Royals
PBKS vs RR IPL 2025: ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ విన్నింగ్ ట్రాక్ కు అడ్డుకట్ట వేసింది రాజస్థాన్ రాయల్స్. ఏకంగా 50 పరుగులు తేడాతో పంజాబ్ టీమ్ ను రాజస్థాన్ ఓడించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 18వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 205/4 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 206 పరుగులు టార్గెట్ ను ఉంచింది. భారీ టార్గెట్ లో బ్యాటింగ్ మొదలుపెట్టిన పంజాబ్ టీమ్ 20 ఓవర్లలో 9 వికట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసింది.
PBKS vs RR
రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ కింగ్స్‌ను ఓడించి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ కు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 67 పరుగులు తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు.
అలాగే, రియాన్ పరాగ్ 43* పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. సంజూ శాంసన్ 38, హిట్మేయర్ 20 పరుగుల ఇన్నింగ్స్ లతో రాజస్థాన్ రాయల్స్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
Image Credit: TwitterPunjab Kings
పంజాబ్ బౌలింగ్ లో లాకీ ఫెర్గూసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్, మార్కో జాన్సెన్ తలా ఒక వికెట్ తీశారు.
భారీ టార్గెట్ తో బ్యాటింగ్ మొదలుపెట్టిన పంజాబ్ ను తొలి ఓవర్ లోనే జోఫ్రా ఆర్చర్ కోలుకోని దెబ్బకొట్టాడు. అద్భుతమైన బౌలింగ్ తో మొదటి ఓవర్ తొలి బంతికి ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి శ్రేయాస్ అయ్యర్ ను బౌల్డ్ చేశాడు. దీంతో తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయి పంజాబ్ టీమ్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చి స్టోయినిస్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు.
నేహల్ వధేరా సూపర్ నాక్
కానీ, ఎప్పుడైతే క్రీజులో కి యంగ్ ప్లేయర్ నేహల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్ వెల్ వచ్చారో అప్పుడు మళ్లీ మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ వైపు తీసుకువచ్చారు. వధేరా సూపర్ నాక్ ఆడాడు. 62 పరుగుల తన హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 అద్భుతమైన సిక్సర్లు బాదాడు.
అలాగే, గ్లెన్ మ్యాక్స్ వెల్ కూడా మంచి టచ్ లో కనిపించాడు. అయితే, కీలక సమయంలో బిగ్ షాట్ ఆడబోయే తీక్షణ బౌలింగ్ లో జైస్వాల్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. మ్యాక్స్ వెల్ 30 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ మళ్లీ రాజస్థాన్ రాయల్స్ చేతిలోకి వెళ్లింది.
రాజస్థాన్ బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుకున్నాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆర్చర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సందీప్ శర్మ, తీక్షనలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. పంజాబ్ టీమ్ 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ, బెంగళూరు జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.