IPL Mini Auction 2026: మినీ వేలంలో జాక్‌పాట్ కొట్టే ప్లేయ‌ర్స్ వీళ్లే... ఏకంగా రూ. 30 కోట్ల పైమాటే..

Published : Dec 16, 2025, 11:58 AM IST

IPL Mini Auction 2026: ఐపీఎల్ మినీ వేలానికి స‌ర్వం సిద్ధ‌మైంది. సోమ‌వారం మినీ ఆక్ష‌న్ జ‌ర‌గ‌నుంది. దీంతో ఈ వేలంలో అత్యధిక ధరకు వెళ్లే అవకాశం ఉన్న 3 కీలక ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
మినీ ఆక్షన్‌లో భారీ ధరలకు కార‌ణం ఏంటంటే

IPL మినీ ఆక్షన్ సాధారణంగా మెగా ఆక్షన్ స్థాయిలో హడావుడి ఉండదు. అయినా కొంత‌మంది ప్రత్యేకమైన ఆటగాళ్లకు మాత్రం ఊహించని స్థాయిలో ధరలు పలుకుతాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం మినీ వేలంలో మంచి ఆటగాళ్లు తక్కువ సంఖ్యలో ఉండటమే. అలాగే ఫ్రాంచైజీలు మంచి బ్యాలెన్స్‌తో రావ‌డం. ఈసారి KKR వద్ద రూ.64.30 కోట్లు, CSK వద్ద రూ.43.40 కోట్లు ఉన్నాయి. ఇదే అత్యధిక బిడ్లకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.

25
కామెరన్ గ్రీన్ – ఆక్షన్ స్టార్

బేస్ ధర: రూ.2 కోట్లు

కామెరన్ గ్రీన్ లాంటి ఆటగాళ్లు మినీ ఆక్షన్‌లో చాలా అరుదు. టాప్ ఆర్డర్ బ్యాటింగ్, వేగంగా పరుగులు, అవసరమైనప్పుడు బౌలింగ్, ఫీల్డింగ్‌లో చురుకుదనం ఇలా ఆల్ ఇన్ వ‌న్ ప్యాకేజీలో ఉన్న కొంత‌మంది ప్లేయ‌ర్స్‌లో కామెర‌న్ ఒక‌రు. KKR అతడిని రస్సెల్ తరహా పాత్రలో ఉపయోగించాలని భావిస్తోంది. భారీ పర్స్ ఉండటం వల్ల బిడ్డింగ్‌లో పైచేయి వాళ్లదే అని చెప్పాలి. అంచనా ప్ర‌కారం కోల్‌క‌తా కెమెర‌న్‌ను సుమారు రూ. 20 నుంచి రూ. 30 కోట్ల‌కు సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది.

35
లియం లివింగ్‌స్టోన్ – టీమ్ అవసరానికి సరైన ఎంపిక

బేస్ ధర: రూ.2 కోట్లు. లివింగ్‌స్టోన్ పవర్ హిట్టర్ మాత్రమే కాదు. స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. మిడిల్ ఆర్డర్‌లో మ్యాచ్‌ను మ‌లుపు తిప్పే సామర్థ్యం ఉంది. ఇదే అత‌డికి డిమాండ్ పెర‌గ‌డానికి కార‌ణంగా చెబుతున్నారు. CSK ఈసారి ప్రీమియం ఓవర్సీస్ ఆల్‌రౌండర్ కోసం చూస్తోంది. గ్రీన్ అందుబాటులోకి రాకపోతే లివింగ్‌స్టోన్ ప్రధాన టార్గెట్ కావచ్చు. అంచనా ప్ర‌కారం సీఎస్‌కే జ‌ట్టు ఇత‌డిని రూ. రూ.14–16 కోట్లకు సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది.

45
రవి బిష్ణోయ్ – ఇండియన్ భరోసా స్పిన్నర్

బేస్ ధర: రూ.2 కోట్లు. మినీ ఆక్షన్‌లో భారత ఆటగాళ్లకు ఎప్పుడూ అదనపు విలువ ఉంటుంది. ఓవర్సీస్ కాంబినేషన్‌కు భంగం కలగకుండా ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థిరత్వం ఇస్తారు. రవి బిష్ణోయ్ ప్రస్తుతం అరుదైన కేటగిరీలో ఉన్నాడు. అనుభవం ఉన్న భారత రిస్ట్ స్పిన్నర్. ఈ తరహా ఆటగాళ్లు మార్కెట్‌లో తక్కువగా ఉంటారు. అంచ‌నా ప్ర‌కారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ర‌విని రూ. 8 నుంచి రూ. 10 కోట్ల‌కు సొంతం చేసుకునే అవ‌కాశం ఉంది.

55
టాప్ డీల్ ఎవ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.?

ఈ మినీ ఆక్షన్‌లో గ్రీన్, లివింగ్‌స్టోన్, బిష్ణోయ్ ముగ్గురూ పెద్ద మొత్తాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. భారీ పర్స్ ఉన్న జట్లు, సరైన పాత్ర కోసం చూస్తున్న టీమ్‌లు బిడ్డింగ్‌ను ఆకాశానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ మినీ ఆక్షన్‌లో మెగా రేంజ్ డ్రామా లేకపోయినా, ఈ ముగ్గురు ఆటగాళ్లు మాత్రం హెడ్‌లైన్స్‌లో నిలవడం ఖాయం.

Read more Photos on
click me!

Recommended Stories