బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ .. ఇతడు సెంచరీ చేశాడో టీమిండియాకు ఓటమే..!

Published : Dec 04, 2025, 02:46 PM IST

Ruturaj Gaikwad : ఇంతడు సెంచరీ చేశాడో ఆ జట్టు ఓడిపోయినట్లే… గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా గురిగింజంత అదృష్టం లేదు... ఇంతకూ ఆ టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా? 

PREV
15
ఇతడు సెంచరీ చేశాడో అంతే సంగతి..

Ruturaj Gaikwad : ఏ క్రికెటర్ అయినా తన జట్టును గెలిపించేందుకు అద్భుతంగా ఆడాలనుకుంటాడు. కానీ ఒక్కోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోతారు... ఇదే అనుభవం నిన్న (డిసెంబర్ 3, మంగళవారం) దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లకు ఎదురయ్యింది. ఈ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ సూపర్ బ్యాటింగ్ తో సెంచరీలు చేసినా జట్టును గెలిపించలేకపోయారు.

25
రుతురాజ్ సెంచరీపై విమర్శలు..

విరాట్ కోహ్లీ సంగతేమో గానీ రుతురాజ్ గైక్వాడ్ కు టీమిండియా ఓటమి మరింత చెడ్డపేరు తెచ్చిపెట్టింది. చెత్త ఆటతీరుతో కాదు అద్భుత సెంచరీ చేసి విమర్శలపాలైన అనుభవం రుతురాజ్ కు ఎదురయ్యింది. ''ఇక వీడు ఎప్పుడూ సెంచరీ చేయకూడదు..'' అని కొందరు టీమిండియా అభిమానులు కోరుకునే స్థాయిలో దురదృష్టం రుతురాజ్ ను వెంటాడుతోంది. రాయ్ పూర్ వన్డేలో టీమిండియా ఓటమి తర్వాత రుతురాజ్ బ్యాడ్ లక్ పై తీవ్ర చర్చ సాగుతోంది.

35
రుతురాజ్ సెంచరీ చేశాడా... టీమిండియా ఓటమి పక్కా..!

ప్రస్తుతం సౌతాఫ్రికా భారత పర్యటనలో ఉంది... ఇప్పటికే టెస్ట్ సీరిస్ ముగియగా వన్డే సీరిస్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే సెకండ్ వన్డే నిన్న (డిసెంబర్ 3న) చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ లో జరిగింది. ఇందులో టీమిండియా 358 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు..దీంతో కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు వృధా అయ్యాయి.

అయితే రుతురాజ్ సెంచరీ చేసినా జట్టు ఓడిపోవడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికే అతడు అంతర్జాతీయ క్రికెట్ లో రెండు సెంచరీలు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో రెండు సెంచరీ చేశారు. ఇలా ఇతడు సెంచరీ చేసిన ప్రతిసారి అతడు ప్రాతినిధ్యం వహించే టీం ఓటమిపాలయ్యింది.

45
రుతురాజ్ సెంచరీలు వృధా

డిసెంబర్ 3న దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో రుతురాజ్ 83 బంతుల్లో 105 పరుగులు చేశాడు. కోహ్లీతో కలిసి 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయినా భారత్ ఓడిపోయింది. గతంలో ఆస్ట్రేలియాపై రుతురాజ్ సెంచరీ చేసినప్పుడు కూడా జట్టు ఓటమి పాలైంది.

నవంబర్ 28, 2023న గౌహతిలో ఆస్ట్రేలియాపై జరిగిన టీ20లో రుతురాజ్ 123 పరుగులు చేశాడు. ఇది అతని తొలి అంతర్జాతీయ సెంచరీ. కానీ, గ్లెన్ మాక్స్‌వెల్ కూడా సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా గెలిచింది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ అదే పునరావృతమైంది.

55
ఐపిఎల్ లోనూ రుతురాజ్ క బ్యాడ్ లక్..

అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు, ఐపీఎల్‌లోనూ రుతురాజ్ 2 సెంచరీలు చేస్తే, రెండుసార్లూ అతని జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. 2021లో రాజస్థాన్‌పై, 2024లో లక్నోపై సెంచరీలు చేసినా ఫలితం మారలేదు. ఆసక్తికర విషయం ఐపిఎల్ చరిత్రలో ఇప్పటివరకు సిఎస్కే ఆటగాళ్లు 10 సెంచరీలు చేశారు… ఇందులో ఎనిమిదిసార్లు సిఎస్కేదే విజయం. గైక్వాడ్ సెంచరీ చేసిన రెండుసార్లు మాత్రం సీఎస్కే ఓడిపోయింది. ఇలా ఐపిఎల్ తో పాటు అంతర్జాతీయ క్రికెట్లో రుతురాజ్ సెంచరీ చేసిన ప్రతీసారి జట్టు ఓడిపోతోంది… ఇలా జరగడం   నాలుగోసారి.

Read more Photos on
click me!

Recommended Stories