ఈ సంవత్సరం (2025లో) భారతీయులు గూగుల్ లో ఎక్కువగా ఏం వెతికారో ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం వెల్లడించింది. ఇందులో హైదరాబాదీ క్రికెటర్ టాప్ 3 లో చోటు దక్కించుకున్నాడు. అతడెవరో తెలుసా?
భారత్‌లో 2025 టాప్ 10 ట్రెండింగ్ సెర్చ్‌ల జాబితాలో ఐపీఎల్ మొదటి స్థానంలో ఉంది. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆర్‌సీబీ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచిన సీజన్ ఇది. అందుకే ఈసారి ఐపిఎల్ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
211
క్రికెటర్స్ లో వైభవ్ టాప్
వ్యక్తుల విషయానికొస్తే… ఈ ఏడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసుకోవడానికే ఎక్కువమంది భారతీయులు గూగుల్‌లో వెతికారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్ ఆరంభంలోనే అద్భుతం చేశాడు. ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
311
రెండో స్థానంలో పంజాబ్ ఆటగాడు
గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ల జాబితాలో పంజాబ్ కింగ్స్ యువ ఆటగాడు ప్రియాంశ్ ఆర్య రెండో స్థానంలో నిలిచాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ గూగుల్ సెర్చ్‌లో మూడో స్థానంలో నిలిచాడు.
511
నాలుగో స్థానంలో చెన్నై ఆటగాడు
చెన్నై యువ ఆటగాడు షేక్ రషీద్ గూగుల్ సెర్చ్‌లో నాలుగో స్థానంలో నిలవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
611
మహిళల్లో స్మృతిని దాటిన జెమీమా
మహిళా క్రీడాకారుల్లో స్మృతి మంధానను అధిగమించింది యువ సంచలనం జెమీమా రోడ్రిగ్స్. మహిళా క్రికెటర్స్ లో అగ్రస్థానంలో నిలిచింది. భారత క్రీడాకారుల్లో జెమీమా ఐదో స్థానంలో ఉంది.
711
ఆరో స్థానంలో ఆయుష్ మాత్రే
చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్, భారత అండర్ 19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రే ఆరో స్థానంలో ఉన్నాడు.
811
స్మృతి ఏడో స్థానంలో
గూగుల్ సెర్చ్‌లో భారత మహిళా క్రీడాకారిణి స్మృతి మంధాన ఏడో స్థానంలో ఉంది. మహిళల ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన, పెళ్లితో స్మృతి వార్తల్లో నిలిచింది.
911
ఎనిమిదో స్థానంలో మలయాళీ ఆటగాడు
గూగుల్ సెర్చ్‌లో ఎనిమిదో స్థానంలో నిలిచాడు మలయాళీ ఆటగాడు కరుణ్ నాయర్. ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి తిరిగి వచ్చిన కరుణ్‌ను ఇంగ్లాండ్ పర్యటన తర్వాత తొలగించారు.
1011
ఉర్విల్ పటేల్ తొమ్మిదో స్థానంలో
ఐపీఎల్‌లో చెన్నై తరఫున అరంగేట్రం చేసిన ఉర్విల్ పటేల్ గూగుల్ సెర్చ్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
1111
టాప్ 10లో మరో మలయాళీ
గూగుల్ సెర్చ్ టాప్ 10లో ఆశ్చర్యపరిచిన రెండో మలయాళీ ఆటగాడు విఘ్నేష్ పుత్తూర్. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేసి, తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి విఘ్నేష్ మెరిశాడు.