IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. ఐపీఎల్ లో కొత్త రూల్ తో పాటు పలు మార్పులు తీసుకువచ్చింది.
3 New Rules BCCI Introduced In Indian Premier League 2025
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 థ్రిల్ కు వేదిక సిద్ధమైంది. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ మార్చి 22న కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. అయితే, ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బిగ్ డెసిషన్ తీసుకుంది. ఐపీఎల్ కోసం కొత్త రూల్స్ తీసుకువచ్చింది. అలాగే, పాత నియమాల్లో పలు మార్పులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గత కొన్ని సంవత్సరాలుగా వ్యూహాత్మక టైమ్‌అవుట్‌లు, ఇంపాక్ట్ ప్లేయర్‌లతో సహా అనేక కొత్త రూల్స్ ను పరిచయం చేసింది. ఇప్పుడు IPL 2025 కి ముందు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరొక కొత్త నియమాన్ని ప్రకటించింది. ఈ కొత్త రూల్ ఈ మెగా క్రికెట్ లీగ్ లో సాయంత్రం జరిగే మ్యాచ్‌లలో రెండవ ఇన్నింగ్స్‌లో వర్తిస్తుంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, రెండవ ఇన్నింగ్స్‌లోని పదవ ఓవర్ తర్వాత బంతిని మార్చే ఎంపికను ఎంచుకోవడానికి జట్లకు అనుమతి ఉంటుంది. మ్యాచ్‌ల ఫలితంపై మంచు ప్రభావాన్ని తగ్గించడానికి ఈ నియమాన్ని ప్రవేశపెట్టారు.
24
IPL 2025 Rule: Second New Ball, Saliva Ban Lifted
సెకండ్ బాల్ రూల్ ఏమిటి?
రాత్రి మ్యాచ్‌లలో మంచు ప్రభావాన్ని తగ్గించే విషయంలో రెండో బాల్ (రెండవ బంతి) నియమాన్ని ప్రవేశపెట్టారు. మంచు కారణంగా బౌలర్లు బంతిని పట్టుకోవడం కష్టమవుతుంది, ఇది బ్యాట్స్‌మెన్‌కు, ముఖ్యంగా టార్గెట్ సయయంలో వారికి భారీ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి IPL రాత్రి మ్యాచ్‌లలో రెండవ బంతిని ఉపయోగించడానికి అనుమతించే రూల్ ను బీసీసీఐ తీసుకువచ్చింది.
ఈ కొత్త రూల్ ప్రకారం.. రెండవ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత మైదానంలో ఉన్న అంపైర్ బంతి పరిస్థితిని అంచనా వేస్తాడు. అధిక మంచు కురుస్తున్నట్లు గుర్తించినట్లయితే, బౌలింగ్ జట్టు కొత్త బంతిని ఉపయోగించడానికి వీలు వుంటుంది. అంటే మ్యాచ్ లో మళ్లీ కొత్త బంతిని ఉపయోగించడం బౌలర్లకు అనుకూలించే అంశం అని చెప్పవచ్చు. అయితే, ఈ రెండో కొత్త బంతి రూల్ మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లకు వర్తించదు.
34
IPL 2025’s big rule changes
17 ఐపీఎల్ సీజన్ల హిస్టరీని గమనిస్తే.. రాత్రిళ్లు జరిగిన చాలా మ్యాచ్ లలో మంచు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపింది. మరీ ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ సమయంలో మంచు కారణంగా బౌలింగ్ చేయడం ప్లేయర్లకు సవాలుగా ఉంటుంది. మంచు ప్రభావం ఉంటే బ్యాటర్ల హవానే ఉంటుంది. అందుకే బ్యాట్, బాల్ మధ్య సరైన సమతుల్యతను తీసుకురావడానికి బీసీసీఐ ఈ రెండో బాల్ రూల్ ను తీసుకువచ్చింది.
44
బంతిని ఉమ్మితో రుద్దవచ్చు !
ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ కొన్ని విషయాల్లో మార్పులు తెచ్చింది. అదే బంతని ఉమ్మి (లాలాజలం)తో రుద్దడం. ఐపీఎల్ లో పాల్గొంటున్న చాలా మంది కెప్టెన్ల ఈ ప్రతిపాదనకు అంగీకరించడంతో రాబోయే ఐపీఎల్‌లో బంతిపై లాలాజలం వాడకంపై నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.
కోవిడ్ -19 మహమ్మారి కారణంగా బంతిపై ఉమ్మివేసి రుద్దడాన్ని బీసీసీఐ నిషేధించింది. మార్చి 22 నుండి ఈ మెగా క్రికెట్ లీగ్ ప్రారంభం కావడానికి ముందు ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బాల్ పై ఉమ్మివేసి రుద్దే నియమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బంతిని గ్రిప్ తో పట్టుకోవడానికి మరింత వీలుకలుగుతుంది.