IPL 2025: ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే 4 జట్లు ఇవే !

Published : Mar 21, 2025, 05:29 PM IST

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తొలి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు కేకేఆర్ తో తలపడనుంది. అయితే, ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ప్రయాణంపై మైక్ హెస్సన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

PREV
14
IPL 2025: ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే 4 జట్లు ఇవే !

IPL 2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) 18వ ఎడిషన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకార్) బలమైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. 

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నమెంట్ ప్రారంభం కాకముందే, ఈ సంవత్సరం ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఏ నాలుగు జట్లు ప్లేఆఫ్‌లోకి ప్రవేశిస్తాయనే దానిపై చాలా చర్చలు జరుగుతున్నాయి. క్రమంలోనే విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ మాజీ కోచ్ మైక్ హెస్సన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
 

24
Indian Premier League: These are the 4 teams that will reach the IPL playoffs this time!

ఐపీఎల్ 2025 ఫ్లేఆఫ్స్: టాప్ 3లోకి గుజరాత్ !  

ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో ఏ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయనే విషయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో గుజరాత్ టైటాన్స్ (GT) అత్యుత్తమ టాప్ త్రీలో ఒకటిగా నిలుస్తుందని అంచనా వేశాడు. ఎందుకంటే జోస్ బట్లర్, శుభ్‌మాన్ గిల్, సాయి సుదర్శన్‌ల రూపంలో బలమైన త్రయాన్ని కలిగివుందనీ, ఆ జట్టు ప్రయాణంలో వీరు కీలక పాత్ర పోషిస్తారని తెలిపాడు.

34
Indian Premier League: These are the 4 teams that will reach the IPL playoffs this time!

విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి ఈ సారి కూడా కష్టమేనా?

తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). ప్రతిసారి కప్ మనదే అనే నినాదంతో టోర్నీలోకి ఎంట్రీ ఇస్తున్న ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే, ఈ సారి ట్రోఫీని ముద్దాడడమే టార్గెట్ గా జట్టులో మార్పులు చేసింది. రజత్ పాటిదార్ ను కొత్త కెప్టెన్ గా నియమించింది. 

కానీ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం లేదని ఆర్సీబీ మాజీ కోచ్ మైక్ హెస్సన్ షాకింగ్ అంచనా వేశాడు. కాగా, గత ఐపీఎల్ ఎడిషన్‌లో ప్లేఆఫ్‌లోకి ప్రవేశించి ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఆర్సీబీ నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈసారి టోర్నమెంట్‌లో RCB 9వ స్థానంలో నిలుస్తుందని మైక్ హెస్సన్ అంచనా వేశాడు.

44
Indian Premier League: These are the 4 teams that will reach the IPL playoffs this time!

మళ్లీ ఐపీఎల్ ఫైనల్ ను కేకేఆర్-ఎస్ఆర్హెచ్ లు ఆడతాయా? 

ఐపీఎల్ 2025 టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశిస్తాయని మైక్ హెస్సన్ అంచనా వేశాడు. శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ 5వ స్థానంలో, అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో, శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 7వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని చెప్పాడు. 

అలాగే, సంజూ సామ్సన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 8వ స్థానంలో, రజత్ పాటిదార్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9వ స్థానంలో, రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ 10వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని మైక్ హస్సెన్ అంచనా వేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories