IPL 2025 Opening Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 దగ్గర పడుతుండటంతో క్రేజ్ ఎక్కువ అవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ అయిపోయాక అందరి కళ్ళు ఐపీఎల్ మీదనే ఉన్నాయి. మార్చి 22 నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ స్టార్ట్ అవుతుంది. ఓపెనింగ్ సెర్మనీ చూడటానికి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 PM IST కు ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెరిమనీ భారీ స్థాయిలో సాయంత్రం 6:00 PM IST జరగనుంది.
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ నుండి పెద్ద స్టార్లు తమ ప్రదర్శనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్టేజ్ మీద దుమ్ములేపేలా డాన్స్ చేయనున్నారు. అలాగే, శ్రద్ధా కపూర్ కూడా దన ప్రదర్శనలతో అదరగొట్టనుంది.
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB
ఖాన్స్‌తో, కపూర్‌తో పాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొంటారు. వరుణ్ ధావన్, సంజయ్ దత్, ఇంకా దిశా పటాని కూడా వస్తారని సమాచారం. వాళ్ళందరూ వస్తే ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ చాలా గ్రాండ్‌గా ఉంటుందని చెప్పవచ్చు.
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB
బాలీవుడ్ స్టార్స్‌తో పాటు మ్యూజిక్ స్టార్లు కూడా ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొననున్నారు. స్టార్ సింగర్లు శ్రేయా ఘోషల్, అరిజిత్ సింగ్, ఇంకా కరణ్ ఔజ్లా లు తమ పాటలతో క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే, అమెరికన్ బ్యాండ్ వన్ రిపబ్లిక్ కూడా వాళ్ళ హిట్ సాంగ్స్ తో మార్చి 22న ఈడెన్ గార్డెన్స్ హోరెత్తనుంది.
IPL Opening Ceremony Salman Khan Disha Patani Shah Rukh Khan KKR vs RCB
మార్చి 22న జరిగే ఐపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్‌లో ప్రస్తుత ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యం ఇస్తుంది. అయితే, తొలి మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టే అవకాశముంది.
మధ్యాహ్నం నుంచి వర్షం పడే అవకాశాలుున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయనీ, అలాగే, ఈదురుగాలు వీస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పగటిపూట వర్షం పడే అవకాశం 74% ఉండగా, సాయంత్రం 90% ఉంటుందని Accuweather నివేదికలు పేర్కొంటున్నాయి.