SRH vs PBKS : అభిషేక్ దెబ్బకు పంజాబ్ షేక్... కేవలం 13 బంతుల్లో 68 పరుగులేంటి సామీ..!

Published : Apr 11, 2026, 05:34 PM IST

Indian Premier League : ఐపిఎల్ 2026 లో మరో హై స్కోరింగ్ మ్యాాచ్ సాాగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ పంజాబ్ బౌలర్లను చితక్కొడుతూ కేవలం 28 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇలా ఎస్ఆర్‌హెచ్ 220 పరుగులు లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచింది.

PREV
15
అదరగొట్టిన అభిషేక్..

SRH vs PBKS : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 లో ప్రతి మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి... ప్రతి టీం సునాయాసంగా 200 పరుగులు కొట్టేస్తోంది. అలాంటిది భారీ హిట్టర్లతో నిండిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏస్థాయిలో ఆడుతుందో ఊహించవచ్చు. తాజాగా చండీగఢ్ లో జరుగుతున్న మ్యాచ్ లో హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ చెలరేగిపోయారు... దీంతో పవర్ ప్లే లోనే సెంచరీ భాగస్వామ్యం నమోదయ్యింది. దీంతో ఐపిఎల్ చరిత్రలో నిలిచిపోయేలా పలు రికార్డులు నమోదయ్యాయి.

25
అదరగొట్టిన అభిషేక్...

సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన విశ్వరూపం చూపించాడు... పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 28 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు... ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అంటే అతడు చేసిన 74 పరుగుల్లో 68 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే... కేవలం 6 పరుగులు మాత్రమే సింగిల్స్ రూపంలో వచ్చాయి. దీన్నిబట్టే అభిషేక్ మైదానాన్ని ఏస్థాయిలో షేక్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.

35
పవర్ ప్లే లో అత్యధిక సిక్సర్ల రికార్డు..

ఐపిఎల్ చరిత్రలోనే పవర్ ప్లే లో అత్యధిక సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు అభిషేక్. మ్యాచ్ ఆరంభంనుండే సిక్సర్లలో విరుచుకుపడుతూ 6 ఓవర్లలోపే 7 సిక్సులు బాదాడు. పవర్ ప్లే లో ఇప్పటివరకు సనత్ జయసూర్య (2008), జాస్ బట్లర్ (2018), బెయిర్ స్టో (2022) లో 7 సిక్సర్లు బాదారు... తాజాగా వీరి సరసన అభిషేక్ శర్మ చేరాడు.

45
పవర్ ప్లే లోనే సెంచరీ...

పవర్ ప్లే (1 నుండి 6 ఓవర్లు) లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేశారు... దీంతో పవర్ ప్లే లో అత్యధిక పరుగుల రికార్డు హైదరాబాద్ పేరిట నమోదయ్యింది. ఆసక్తికర విషయం ఏంటంటే ఈ పవర్ ప్లే లో అత్యధిక పరుగుల రికార్డులన్నీ సన్ రైజర్స్ వే.

2024 లో డిల్లీపై పవర్ ప్లేలోనే 125 పరుగులు చేసింది హైదరాబాద్ టీం... ఇదే ఐపిఎల్ చరిత్రలో అత్యధిక పవర్ ప్లే స్కోరు. ఇక ఇదే 2024 లో లక్నోపై పవర్ ప్లే లోనే 107 పరుగులు చేసింది సన్ రైజర్స్... ఇది రెండో అత్యుత్తమ స్కోరు. తాజాగా పంజాబ్ పై పవర్ ప్లేలో సాధించిన 105 పరుగులు మూడో అత్యుత్తమ స్కోరు. ఇలా పవర్ ప్లే లో హయ్యెస్ట్ స్కోర్ రికార్డులన్ని ఎస్ఆర్‌హెచ్ పేరిటే ఉన్నాయి.

55
పంజాబ్ లక్ష్యం 220...

సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు చెలరేగడంతో పంజాబ్ ముందు 220 పరుగుల భారీ లక్ష్యం ఉంది. అభిషేక్ 74 పరుగులు (28 బంతుల్లో), ట్రావిస్ హెడ్ 38 పరుగులు (23 బంతుల్లో) చెలరేగి ఆడి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్ 27 పరుగులతో (17 బంతుల్లో) ఆకట్టుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ తన బ్యాటింగ్ స్టైల్ కు భిన్నంగా ఆడాడు.. 33 బంతుల్లో కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది... పంజాబ్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 220 పరుగులు చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories