Cricket: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ డ్రంక్ డ్రైవింగ్ కేసులో అరెస్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడుతున్న వార్నర్, ఈ కేసుకు సంబంధించి ఆయన త్వరలో కోర్టులో హాజరుకావాల్సి ఉంది.
సిడ్నీలోని మారౌబ్రా ప్రాంతంలో ఆదివారం రాత్రి పోలీసులు నిర్వహించిన ర్యాండమ్ బ్రెత్ టెస్ట్ సమయంలో ఈ ఘటన జరిగింది. వార్తల ప్రకారం, పరీక్షా కేంద్రానికి కొద్దిదూరంలోనే వార్నర్ తన వాహనాన్ని ఆపి పార్క్ చేశాడు. దీనిని గమనించిన పోలీసులు వాహనం వద్దకు వెళ్లి పరీక్ష నిర్వహించారు. పరీక్షలో వార్నర్ శరీరంలో ఆల్కహాల్ లెవల్స్ చట్టపరమైన పరిమితికి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి మారౌబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
23
మే నెలలో కోర్టులో హాజరు
పోలీసుల ప్రకటన ప్రకారం, ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో మలబార్ రోడ్డులో స్టేషనరీ ర్యాండమ్ బ్రెత్ టెస్టింగ్ జరుగుతోంది. పరీక్షా కేంద్రానికి ముందే ఒక వాన్ ఆగి నిలిచినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ట్రాఫిక్ అండ్ హైవే పట్రోల్ అధికారులు డ్రైవర్‌కు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పరీక్షలో ఆల్కహాల్ స్థాయి 0.1గా నమోదైంది. ఈ కేసులో వార్నర్ మే నెలలో కోర్టులో హాజరుకానున్నారు.
33
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
డేవిడ్ వార్నర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తర్వాత ఆయన మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2024 జనవరిలో వెస్టిండీస్‌తో జరగాల్సిన వన్డే సిరీస్‌కు నాలుగు వారాల ముందు ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే వార్నర్ ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నాడు. కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న అతడు.. ఇటీవలే వ్యక్తిగత సెలవు తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లాడు. ఈ లీగ్ కోసం త్వరలోనే మళ్లీ పాక్‌కు వెళ్లనున్నాడు.