IPL 2025 : భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL) వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో పరిస్ధితులు సాధారణంగా మారాయి. దీంతో క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపింది బిసిసిఐ... ఐపిఎల్ ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తొమ్మిదిరోజుల విరామం తర్వాత అంటే ఏప్రిల్ 17న ఐపిఎల్ పున:ప్రారంభం కానుంది.
అయితే ఈ సీజన్ లో ఇకపై జరిగే ఐపిఎల్ మ్యాచుల కోసం కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. మైదానంలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం క్రికెట్ నే హైలైట్ చేయాలని భావిస్తోందట. అందుకోసమే చీర్ లీడర్స్ డ్యాన్సులు, డిజె సౌండ్స్, రంగురంగుల లైట్లు, టపాకుల మోత లేకుండా చూడాలని ఐపిఎల్ నిర్వహకులను బిసిసిఐ ఆదేశించినట్లు తెలుస్తోంది.