నిరాశ‌లో ఆర్సీబీ ఫ్యాన్స్.. అస‌లు విరాట్ కోహ్లీ టీమ్ ప్లానేంటి?

First Published | Nov 27, 2024, 7:24 PM IST

RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రాబోయే ఐపీఎల్ 2025 సీజన్ కోసం తమ 22 మంది సభ్యుల జట్టును ఫిక్స్ చేసుకుంది. వేలానికి ముందు విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, యశ్ దయాల్‌లను రిటైన్ చేసుకున్న ఆర్సీబీ టీమ్ పై ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. అస‌లు ఏం జ‌రిగింది? 
 

virat Kholi

RCB : ఐపీఎల్ 18వ సీజన్ ఆటగాళ్ల వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. 1000 మందికి పైగా ఆటగాళ్లలో 577 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ఇందులో 367 మంది భారతీయులు, 210 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మొత్తంగా ఐపీఎల్ వేలం పూర్తయింది. అయితే, ఆర్సీబీ తీరుపై ఆ టీమ్ ప్యాన్స్ అసంతృప్తిని వ్య‌క్తి చేస్తున్నారు. 

ఐపీఎల్ 2025 మెగా వేలంలో విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ ఇతర జట్లు వదిలిపెట్టిన ఆటగాళ్ల కోసం చాలా డ‌బ్బును ఖ‌ర్చు చేసింది. ఆశ్చర్యకరంగా కొత్తవారికి కూడా కోట్లు చెల్లించి వేలంలో ద‌క్కించుకుంది. ప్ర‌తిసారి స్టార్ ప్లేయ‌ర్ల‌తో బ‌రిలోకి దిగే ఆర్సీబీ టీమ్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేక‌పోయింది. రాబోయే సీజ‌న్ లో టార్గెట్ ఐపీఎల్ ట్రోఫీ వ్యూహాలు ర‌చిస్తోంది. 


RCB Retain Players

18వ ఐపీఎల్‌కు సిద్ధంగా ఉన్న ఆర్సీబీ వేలానికి ముందు విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్‌లను మాత్రమే రిటైన్ చేసుకుంది. విల్ జాక్స్, ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను వదిలిపెట్టడం ఆశ్చర్యం కలిగించింది. వీరిలో కనీసం ఇద్దరిని ఆర్‌టీఎం అట్టిపెట్టుకోవచ్చని అభిమానులు భావించారు. కానీ, అది క‌నిపించ‌లేదు. 

RCB Virat Kohli

ఐపీఎల్ 2025 వేలంలో ఆర్సీబీ స్టార్ విల్ జాక్స్ ను RTM ని ఉపయోగించకుండా వదిలేసింది. అత‌న్ని ద‌క్కించుకున్న ముంబై యజమాని ఆకాష్ అంబానీ ఆర్సీబీ టీమ్ ఆర్టీఎమ్ ఉప‌యోగించ‌క‌పోవ‌డంతో సంతోషం వ్య‌క్తం చేస్తూ బెంగ‌ళూరు జ‌ట్టు య‌జమానితో కరచాలనం చేశాడు. దీంతో క్రికెట్ విమర్శకులు సైతం షాక్ అయ్యారు. ఇలా ఎందుకు చేశాడనే ప్రశ్న తలెత్తింది. గత సీజన్‌లో జాక్స్ 8 మ్యాచ్‌ల్లో 230 పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు. ఇలాంటి ఆటగాళ్ల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

Virat Kohli

ఆటగాళ్లను కొనుగోలు చేసిన తీరు చూస్తుంటే ఆర్‌సీబీకి కప్‌ అవసరం లేదనీ, అభిమానుల డబ్బు అవసరమని అనే చ‌ర్చ కూడా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తోంది. ఆర్సీబీ గెలిచినా ఓడినా కన్నడిగుల మద్దతు ఉంటుంది. కానీ, ఆర్సీబీ గత కొన్నేళ్లుగా కన్నడిగులను నిర్లక్ష్యం చేసింది. ఎందుకంటే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభినవ్ మనోహర్, మనీష్ పాండే, వైశాక్ విజయకుమార్, మయాంక్ అగర్వాల్, విద్వాత్ కవీరప్పలు వేలంలో ఉన్నారు. కానీ ఆర్సీబీ ఒక్క‌రిని కూడా కొనుగోలు చేయలేదు. మనోజ్ భాండాగేను 30 లక్షలకు, దేవదత్ పడిక్కల్‌ను 2 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ వారు బెంచ్‌కే ప‌రిమితం అయ్యే అవ‌కాశ‌ముంది. ఇది అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. 

RCB FANS

ప్ర‌తి సీజ‌న్ కు ముందు 'ఈసారి కప్పు మనదే' అని అభిమానులు ఆశ‌లు పెంచుతూ వ‌స్తోంది. కానీ, ఈ విష‌యంలో ఇప్ప‌టికీ ఆర్సీబీ టార్గెట్ ను అందుకోలేక‌పోయింది. అభిమానుల నమ్మకాన్ని సద్వినియోగం చేసుకున్న ఆర్సీబీ కప్ గెలిచి నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందో.. లేక భావోద్వేగాలతో ఆడుకుంటుందో వేచి చూడాల్సిందే.

RCB Fans

ఐపీఎల్ 2025 ఆర్సీబీ టీమ్ ప్లేయ‌ర్లు వీరే 

విరాట్ కోహ్లీ (రూ. 21 కోట్లు)
రజత్ పాటిదార్ (రూ. 11 కోట్లు)
యశ్ దయాల్ (రూ. 5 కోట్లు)
లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 8.75 కోట్లు)
ఫిల్ సాల్ట్ (రూ. 11.50 కోట్లు)
జితేష్ శర్మ (రూ. 11 కోట్లు)
జోష్ హేజిల్‌వుడ్ (రూ. 12.50 కోట్లు)
రసిఖ్ దార్ (రూ. 6 కోట్లు)
సుయాష్ శర్మ (రూ. 2.60 కోట్లు)
కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) 
భువనేశ్వర్ కుమార్ (రూ. 10.75 కోట్లు)
స్వప్నిల్ సింగ్ (రూ. 50 లక్షలు)
టిమ్ డేవిడ్ (రూ. 3 కోట్లు)
రొమారియో షెపర్డ్ (రూ. 1.50 కోట్లు)
నువాన్ తుషార (రూ. 1.60 కోట్లు)
మనోజ్ భాండాగే (రూ. 30 లక్షలు)
జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు)
దేవదత్ పడిక్కల్ (రూ. 2 కోట్లు)
స్వస్తిక్ చికారా (రూ. 30 లక్షలు)
లుంగీ ఎన్‌గిడి (రూ. 1 కోటి)
అభినందన్ సింగ్ (రూ. 30 లక్షలు)
మోహిత్ రాథీ (రూ. 30 లక్షలు)

Latest Videos

click me!